మూడింటికీ ఒకే ఛార్జర్‌

సెల్‌ఫోన్‌కో ఛార్జర్‌.. స్మార్ట్‌వాచీకి మరో ఛార్జర్‌.. ఇయర్‌పాడ్స్‌కి వేరొక ఛార్జర్‌.. ఇలా వేర్వేరుగా ఛార్జింగ్‌ పెట్టడం స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ని ఇష్టపడే కుర్రకారుకి పెద్ద టాస్కే.

Published : 18 May 2024 00:59 IST

సెల్‌ఫోన్‌కో ఛార్జర్‌.. స్మార్ట్‌వాచీకి మరో ఛార్జర్‌.. ఇయర్‌పాడ్స్‌కి వేరొక ఛార్జర్‌.. ఇలా వేర్వేరుగా ఛార్జింగ్‌ పెట్టడం స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ని ఇష్టపడే కుర్రకారుకి పెద్ద టాస్కే. అందుకే ఈ ప్రయాస తప్పేలా ఈ మూడూ ఒకేచోట, ఒకే సమయంలో ఛార్జింగ్‌ చేసేలా సరికొత్త త్రీ ఇన్‌ వన్‌ వైర్‌లెస్‌ ఛార్జర్‌ని తీసుకొచ్చింది మోఫీ కంపెనీ. దీంతో ఐఫోన్, యాపిల్‌ వాచ్, ఎయిర్‌పాడ్స్‌కి ఒకేసారి ఛార్జింగ్‌ పెట్టొచ్చు. మిగతా వాటితో పోలిస్తే ఛార్జింగ్‌కి అతి తక్కువ సమయం పడుతుంది. దీన్ని ఫోన్‌ స్టాండ్‌గా కూడా వాడుకోవచ్చు.
ధర రూ.10,800.00 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని