nashpreet kaur: ఐపీఎల్.. మాటల సొగసరి
ప్రతి ఐపీఎల్ సీజన్‌కి కొత్త కొత్త స్టార్లు పుట్టుకొస్తుంటారు. మైదానంలో ఆటతో ఆకట్టుకునేవాళ్లే కాదు.. మాటతో కనికట్టు చేసేవాళ్లు కూడా. ఆ వరుసలో ఇప్పుడు నస్ప్రీత్‌కౌర్ చేరింది.
ప్రతి ఐపీఎల్ సీజన్‌కి కొత్త కొత్త స్టార్లు పుట్టుకొస్తుంటారు. మైదానంలో ఆటతో ఆకట్టుకునేవాళ్లే కాదు.. మాటతో కనికట్టు చేసేవాళ్లు కూడా. ఆ వరుసలో ఇప్పుడు నస్ప్రీత్‌కౌర్ చేరింది. రోజూ మ్యాచ్‌లు చూసే ప్రేక్షకులకు ఆమె వన్నెల వ్యాఖ్యానం, అతిథులతో సరదాసరదా సంభాషణలు, గ్రౌండ్‌లో మెరుపు సోయగాలు, క్రికెట్ గణాంకాలపై పట్టు.. ఇవన్నీ ఎరుకే. ఈ ఐపీఎల్‌కే ప్రత్యేక ఆకర్షణగా మారిన ఈ భామ సంగతులు.
* ఇంతకు ఎవరీ సుందరి?: అసలు అమ్మడిది మన ఇండియానే కాదు. ఫిజీలో పుట్టిన భారతీయ సంతతి ఆస్ట్రేలియన్. ముద్దుపేరు నషీ సింగ్. మెల్‌బోర్న్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసి కెరియర్ కోసం ముంబయిలో వాలిపోయింది.
* మల్టీటాలెంటెడ్: వన్నెల వ్యాఖ్యానమే కాదు.. నషీ దగ్గర చాలా కళలే ఉన్నాయి. తను బాగా పాడుతుంది. గిటార్ వాయించగలదు. వంటలో దిట్ట. డ్యాన్స్ ఇరగదీస్తుంది. అన్నింటికీ మించి తను మంచి మోడల్. ఆస్ట్రేలియాలో ‘కాస్మోపాలిటన్ మోడల్ సెర్చ్ కాంపిటీషన్’లో ఐదోస్థానంలో నిలిచింది. కొన్ని లఘుచిత్రాల్లోనూ నటించింది. బయో మెడిసిన్‌లో డిగ్రీ పట్టా అందుకుంది.
* ఐపీఎల్ బాట: పదేళ్ల కిందటే మోడలింగ్‌లో కెరియర్ వెతుక్కోవడానికి ముంబయిలో దిగింది. కొన్ని ఫ్యాషన్ ఈవెంట్లలో క్యాట్‌వాక్ చేసింది. క్రీడలంటే మొదట్నుంచీ ఇష్టం. ఆ ఆసక్తితోనే స్టార్ స్పోర్ట్స్ ఇండియాలో నాలుగేళ్ల కిందట యాంకర్‌గా చేరింది. పెద్దపెద్ద ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేసింది. అదే అనుభవంతో 2020 ఐపీఎల్‌లో మైదానంలోకి దిగింది. ఇప్పుడు ఆమె వేసే దుస్తులు.. మధ్యమధ్యలో ఆటగాళ్లపై వేసే పంచ్‌లు, గుక్క తిప్పుకోకుండా.. తప్పులు రాకుండా ప్రస్తావించే గణాంకాలు అన్నీ బాగుండటంతో.. ఇప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారిపోయింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనం.. హుస్సేన్‌సాగర్ వద్ద బారులుతీరిన విగ్రహాలు
-
LIC పాలసీ పునరుద్ధరణ.. నచ్చిన కార్డ్ ఎంపిక.. అక్టోబర్‌లో మార్పులు ఇవే..!
-
Sapta Sagaralu Dhaati: విడుదలైన వారంలోపే ఓటీటీలోకి.. ‘సప్త సాగరాలు దాటి’
-
Justin Trudeau : నిజ్జర్ విషయంలో అమెరికన్లు మాతోనే : జస్టిన్ ట్రూడో
-
Asian Games: షూటింగ్లో మరో రెండు స్వర్ణాలు.. టెన్నిస్‌లో రజతం
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. 19,550 ఎగువన నిఫ్టీ