CM Chandrababu: లండన్‌లో చంద్రబాబుకు ఘన స్వాగతం

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 03 Nov 2025 06:01 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

నేడు పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న సీఎం

చంద్రబాబు, భువనేశ్వరిలకు స్వాగతం పలుకుతున్న ప్రవాసాంధ్రులు

ఈనాడు, అమరావతి: సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి ఆదివారం లండన్‌ చేరుకున్నారు. వారికి అక్కడి తెలుగువారు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ (ఐఓడీ) సంస్థ 2025 సంవత్సరానికిగానూ ప్రకటించిన డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌ అవార్డును 4న భువనేశ్వరి అందుకోనున్నారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌కు ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ కార్పొరేట్‌ గవర్నెన్స్‌ విభాగంలో గోల్డెన్‌ పీకాక్‌ అవార్డునూ ఆ సంస్థ ఎండీ హోదాలో అదే వేదికపై ఆమె స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. సోమవారం లండన్‌లో పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులతోనూ సీఎం సమావేశం కానున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వారిని ఆహ్వానించనున్నారు. 

  • ఆక్టోపస్‌ ఎనర్జీ గ్రూప్‌ డైరెక్టర్‌ క్రిస్‌ ఫ్రిట్జ్‌ గెరాల్డ్, హిందూజా గ్రూపునకు చెందిన వివిధ సంస్థల ఛైర్మన్‌లతో చంద్రబాబు సమావేశమవుతారు. రోల్స్‌రాయిస్‌ గ్రూపు చీఫ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌ నిక్కీ-గ్రాడీ స్మిత్, శ్రామ్‌ అండ్‌ మ్రామ్‌ సంస్థ ఛైర్మన్‌ శైలేశ్‌ హీరానందాని, శ్యామ్‌ కో హోల్డింగ్స్‌ ఛైర్మన్‌ సంపత్‌కుమార్‌ తదితరులతో వరుసగా భేటీ కానున్నారు.
  • అనంతరం భారత పరిశ్రమల సమాఖ్య నేతృత్వంలో జరిగే రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రసంగిస్తారు. ఇందులో బ్రిటిష్‌ హెల్త్‌ టెక్‌ ఇండస్ట్రీ, ఏఐ పాలసీ ల్యాబ్, ఫిడోటెక్, పీజీ పేపర్‌ కంపెనీ, నేషనల్‌ గ్రాఫెనీ ఇన్‌స్టిట్యూట్, వార్విక్‌ మాన్యుఫాక్చరింగ్‌ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు.
  • లండన్‌లోని భారత హైకమిషనర్‌ దొరైస్వామితో చంద్రబాబు సమావేశం కానున్నారు.

నేటి నుంచి లండన్‌లో అధికారుల పర్యటన  

అమరావతిలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ నెల 3నుంచి 6వరకు సీఆర్‌డీఏ కమిషనర్‌ కన్నబాబు, రాష్ట్ర పురపాలకశాఖ సంచాలకులు సంపత్‌కుమార్, డ్రోన్స్‌ కార్పొరేషన్‌ ఎండీ సౌర్యమాన్‌ పటేల్‌ లండన్‌లో పర్యటించనున్నారు.

Tags :
Published : 03 Nov 2025 04:08 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు