Tirumala: బ్రాడ్‌కాస్ట్‌ ఉద్యోగి స్నేహితుడి తప్పిదంతోనే సినిమా పాటలు: తితిదే

తిరుమలలో శుక్రవారం సాయంత్రం ఎల్‌ఈడీ తెరపై ప్రసారమైన సినిమా పాటల వివాదంపై తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్పందించారు. ‘తొలుత సాంకేతిక సమస్యగా గుర్తించాం. ప్రాథమిక విచారణలో బ్రాడ్‌కాస్ట్‌లో

Updated : 24 Apr 2022 08:59 IST

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: తిరుమలలో శుక్రవారం సాయంత్రం ఎల్‌ఈడీ తెరపై ప్రసారమైన సినిమా పాటల వివాదంపై తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్పందించారు. ‘తొలుత సాంకేతిక సమస్యగా గుర్తించాం. ప్రాథమిక విచారణలో బ్రాడ్‌కాస్ట్‌లో పనిచేసే ఉద్యోగి.. తన స్నేహితుడిని బ్రాడ్‌కాస్ట్‌ గదిలోకి తీసుకెళ్లాడని తేలింది. అత్యవసర పనిపై స్నేహితుడిని అక్కడేఉంచి ఆయన వైకుంఠం-2 వరకు వెళ్లారు. ఉద్యోగి స్నేహితుడు అక్కడున్న రిమోట్‌తో ఆపరేట్‌ చేయడంతో ఇలా జరిగిందని గుర్తించాం. పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని ధర్మారెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని