Rupay credit card rules: రూపే కార్డు వాడుతున్నారా? యూపీఐ యాప్‌ ద్వారా ఇక EMIగా మార్చుకోవచ్చు!

రూపే క్రెడిట్‌ కార్డు వాడుతున్న వారికి కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. యూపీఐ యాప్‌లో త్వరలో కొన్ని కొత్త ఫీచర్లు పలకరించబోతున్నాయి.

Published : 05 Apr 2024 00:02 IST

Rupay credit card | ఇంటర్నెట్‌ డెస్క్‌: రూపే క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? అయితే త్వరలో కొన్ని కొత్త ఫీచర్లు రాబోతున్నాయి. యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై రూపే క్రెడిట్‌కార్డులకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) కొన్ని కొత్త ఫీచర్లను ప్రకటించింది. యూపీఐ యాప్‌లోనే ఈఎంఐగా మార్చుకునే సదుపాయం, క్రెడిట్‌ అకౌంట్‌ బిల్‌ పేమెంట్‌, ఇన్‌స్టాల్‌మెంట్‌ పేమెంట్‌ ఆప్షన్‌, లిమిట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బ్యాంకులు లేదా కార్డు జారీ సంస్థ మే 31 కల్లా ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది.

యూపీఐ లావాదేవీల కోసం రూపే క్రెడిట్‌ కార్డులను అనుసంధానం చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి యూపీఐ యాప్స్‌తో కార్డులను లింక్‌ చేస్తున్నాం. NPCI తాజా నిర్ణయం వల్ల ఇకపై రూపే క్రెడిట్‌ కార్డుల వినియోగం మరింత సులభతరం కానుంది. లింక్‌ చేసిన యూపీఐ యాప్‌లోనే మన లావాదేవీలను ఈఎంఐగా మార్చుకోవచ్చు. చెల్లింపులు చేసే సమయంలోనే ఈఎంఐ ఆప్షన్‌ కూడా అందుబాటులోకి రానుంది. ప్రస్తుత ఈఎంఐల జాబితా కూడా అక్కడే కనిపిస్తుంది. యూపీఐ యాప్‌లోని కరెక్ట్‌ అనే అనే సెక్షన్‌లో కనిపిస్తాయి.

₹కోటి పైన ఇళ్లకు గిరాకీ.. టాప్‌-3లో హైదరాబాద్‌!

అలాగే క్రెడిట్‌ అకౌంట్‌ బిల్‌పేమెంట్‌, ఇన్‌స్టాల్‌మెంట్‌ పేమెంట్‌ ఫీచర్‌ ద్వారా యూపీఐ యాప్‌ ద్వారానే క్రెడిట్‌ కార్డు బిల్లును చెల్లించొచ్చు. కావాలనుకుంటే ఆటో పే ఆప్షన్‌ వినియోగించుకోవచ్చు. ఎప్పుడైనా అవసరం అయితే క్రెడిట్‌ లిమిట్‌ పెంచమని బ్యాంక్‌ను నేరుగా యూపీఐ యాప్ ద్వారానే కోరొచ్చు. అంతేకాదు క్రెడిట్‌ కార్డు ఔట్‌ స్టాండింగ్‌ బిల్‌, మినమిమ్‌ బిల్‌, టోటల్‌ అమౌంట్‌, బిల్‌ డేట్ వంటివి యూపీఐ యాప్‌లోనే చూపించాల్సి ఉంటుంది. ఇంతకుముందు బ్యాంక్‌ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఫీచర్లు ఇకపై క్రెడిట్‌ కార్డు లింక్‌ చేసిన యూపీఐ యాప్‌లోనూ అందుబాటులోకి రానున్నాయన్నమాట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని