Tata Altroz Racer: స్పోర్టీ లుక్‌తో మార్కెట్లోకి టాటా ఆల్ట్రోజ్‌ రేసర్‌ కారు.. ధర, వివరాలు ఇవే..

Tata Altroz Racer: టాటా మోటార్స్‌ ఆల్ట్రోజ్‌ రేసర్‌ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.9.49 లక్షలుగా నిర్ణయించింది.

Published : 07 Jun 2024 16:55 IST

Tata Altroz Racer | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ (Tata motors) తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో కొత్త ఆల్ట్రోజ్‌ రేసర్‌ను (Altroz Racer) తీసుకొచ్చింది. స్పోర్టీ లుక్‌లో తీసుకొచ్చిన ఈ కొత్త ఆల్ట్రోజ్‌ ధర రూ.9.49 లక్షల (ఎక్స్‌ షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది. ఆర్‌1, ఆర్‌2, ఆర్‌3 పేరుతో మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. బేస్‌ వేరియంట్‌తో పోలిస్తే ఆర్‌2 రూ.1 లక్ష అదనం కాగా.. ఆర్‌3 రూ.లక్షన్నర అధికం. ప్యూర్‌ గ్రే, అటామిక్‌ ఆరెంజ్‌ అవెన్యూ వైట్‌ రంగుల్లో లభ్యమవుతుంది.

ఆల్ట్రోజ్‌లో ఎక్స్‌టీరియర్‌, ఇంటీరియర్‌ పరంగా చాలావరకు మార్పులు చేశారు. బ్లాక్‌ కలర్‌ బానెట్‌, రేసింగ్‌ లుక్‌ కోసం ఇచ్చిన చారలు కారుకు పూర్తిస్థాయిలో స్పోర్టీ లుక్‌ను తీసుకొచ్చాయి. వాయిస్‌ అసిస్టెడ్‌ సన్‌రూఫ్‌, 360 డిగ్రీల కెమెరా, వెంటిలేటెడ్‌ ఫ్రంట్ సీట్స్‌తో ఈ కారును తీసుకొచ్చారు. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మైంట్‌ సిస్టమ్‌ను అమర్చారు. భద్రతాపరంగా ఏబీఎస్‌, ఎస్‌ఎస్‌సీ, ఆరు ఎయిర్‌బ్యాగులను అందిస్తున్నారు.

ఇక ఇంజిన్‌ విషయానికొస్తే.. అల్ట్రోజ్‌ రేసర్‌ 1.2 లీటర్‌ 3 సిలిండర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తోంది. 118 బీహెచ్‌పీ, 170ఎన్‌ఎం టార్క్‌తో కూడిన 6 స్పీడ్‌ మాన్యువల్ గేర్‌ బాక్స్‌తో ఈ కారును తీసుకొచ్చారు. క్రూయిజ్‌ కంట్రోల్‌, ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాప్‌, ఫాగ్‌ ల్యాంప్స్‌, డీ ఫాగర్‌ను స్టాండర్డ్‌గా ఇస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్‌ ఐ20 ఎన్‌ లైన్‌, మారుతీ సుజుకీఈ ఫ్రాంక్స్‌, టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ టైజర్‌కు ఆల్ట్రోజ్‌ పోటీ ఇవ్వనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు