TVS Motor: టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల రీకాల్‌.. కారణం ఇదే..

TVS Motor: టీవీఎస్‌ కొత్తగా మార్కెట్‌లోకి తీసుకొచ్చిన ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లను రీకాల్‌ చేసింది. 40వేల స్కూటర్లను వెనక్కి రప్పిస్తోంది.

Published : 11 Jun 2024 16:43 IST

TVS Motor | ఇంటర్నెట్‌డెస్క్‌: ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ విద్యుత్తు స్కూటర్ల రీకాల్‌ చేపట్టింది. ఐక్యూబ్‌ (iQube) మోడల్‌కు చెందిన 40,000 యూనిట్లకు పైగా స్కూటర్లను వెనక్కి రప్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 2023 జులై 10 నుంచి సెప్టెంబర్‌ 3 మధ్య తయారైన స్కూటర్లను వెనక్కి రప్పిస్తున్నామని టీవీఎస్‌ పేర్కొంది.

ఆధార్‌ కేవైసీ ధ్రువీకరణ ఉంటే చెక్‌ అవసరం లేదు: ఈపీఎఫ్‌వో

దీర్ఘకాలం పాటు రైడ్‌ హ్యాండ్లింగ్‌ ఎలా పని చేస్తుందో తెలుసుకోవడంలో భాగంగా బ్రిడ్జ్‌ ట్యూబ్‌ను తనిఖీ చేసేందుకు రీకాల్‌ చేపట్టనున్నట్లు టీవీఎస్‌ తెలిపింది. ఇది ఉచిత రీకాల్‌ ప్రక్రియ అని స్పష్టంచేసింది. కంపెనీ లేదా డీలర్ల ద్వారా కస్టమర్లకు ఈ విషయం తెలుపుతారని వెల్లడించింది. ఇదిలాఉండగా.. టీవీఎస్‌ ఈ ఏడాది మే నెలలోనే ఐక్యూబ్‌ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మొత్తం ఐదు వేరియంట్లు, 11 రంగుల్లో లభిస్తోంది. బేస్‌ వేరియంట్‌ ధర రూ.95,000 (ఎక్స్‌షోరూం) కాగా.. ఐక్యూబ్‌ ఎస్‌టీలో (TVS iQube ST) 3.4kWh బ్యాటరీ ప్యాక్‌తో తీసుకొచ్చిన కొత్త వేరియంట్‌ ధర రూ.1.56 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని