FD rate: డిసెంబరులో ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకులివే..

Latest fd rates: ఈ ఏడాది డిసెంబరులో వివిధ బ్యాంకులు తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. ఆ వివారలపై ఓ లుక్కేయండి.

Published : 25 Dec 2023 20:47 IST

FD rates | ఇంటర్నెట్‌డెస్క్‌: డిసెంబరులో అనేక బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD) రేట్లను సవరించాయి. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (BOI), కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ (Kotak Mahindra Bank), డీసీబీ బ్యాంక్.. ఎఫ్‌డీ వడ్డీ రేట్లను ఆకర్షణీయంగా పెంచాయి. ఆ వివరాలపై ఓ లుక్కేయండి.

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌: ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది. పెంచిన వడ్డీ రేట్లు 2023 డిసెంబర్‌ 11 నుంచి అమల్లోకి వచ్చాయి. సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం.. 7 నుంచి 14 రోజుల మధ్య మెచ్యూర్‌ అయ్యే ఎఫ్‌డీలపై సాధారణ డిపాజిటర్లకు 2.75శాతం వడ్డీని అందిస్తోంది. అదే సీనియర్‌ సిటిజన్లకు 3.25శాతం వడ్డీని ఇస్తోంది. 23 నెలల ఒక రోజు నుంచి 2 సంవత్సరాల మధ్య కాలవ్యవధితో చేసే ఎఫ్‌డీలపై సాధారణ డిపాజిటర్లకు 7.25శాతం, సీనియర్‌ సిటిజన్లకు 7.80 శాతం వడ్డీని ఆఫర్‌ చేస్తోంది. మూడు సంవత్సరాల నుంచి 4 ఏళ్ల కాల వ్యవధికి గానూ7శాతం, సీనియర్‌ సిటిజన్లకు 7.82 శాతం వడ్డీని ఇస్తోంది. నాలుగు సంవత్సరాల నుంచి 5 ఏళ్ల మధ్య మెచ్యూర్‌ అయ్యే ఎఫ్‌డీలపై సాధారణ డిపాజిటర్లకు 7శాతం, సీనియర్‌ సిటిజన్లకు 7.60శాతం వడ్డీని ఇస్తోంది.

పేటీఎంలో 1000 మంది ఉద్యోగులపై వేటు

డీసీబీ బ్యాంక్‌: రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లలో ఎంపిక చేసిన కాలపరిమితిపై ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను డీసీబీ పెంచింది. ఈ రేట్లు డిసెంబర్ 13 నుంచి అమలులోకి వచ్చాయి. 7-45 రోజుల కనీస కాలవ్యవధి డిపాజిట్లపై సాధారణ డిపాజిటర్లకు 3.75శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు 4.25శాతం వడ్డీని అందిస్తోంది. ఏడాది పదకొండు రోజుల నుంచి 18 నెలలు మధ్య మెచ్యూర్‌ అయ్యే ఎఫ్‌డీలపై సాధారణ డిపాజిటర్లు 7.15 శాతం, సీనియర్‌ సిటిజన్లు 7.65 శాతం వడ్డీ పొందొచ్చు. 61- 120 నెలల మధ్య అయితే సాధారణ వ్యక్తులకు 7.25 శాతం, సీనియర్‌ డిపాజిటర్లకు 7.75 శాతం వడ్డీ లభిస్తుంది. మరికొన్ని కాల పరిమితులపై సీనియర్‌ సిటిజన్లకు ఏకంగా 8.6 శాతం వడ్డీని అందిస్తోంది.

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్ల లోపు చేసే డిపాజిట్లపై బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లను పెంచింది. డిసెంబరు 1 నుంచి పెంచిన వడ్డీ రేట్లను అమల్లోకి వచ్చాయి. 46- 90 రోజుల మధ్య కాలవ్యవధితో చేసే డిపాజిట్లపై 5.25శాతం, 91- 179 రోజుల మధ్య అయితే 6శాతం వడ్డీ అందిస్తోంది. 180- 210 రోజుల మధ్య మెచ్యూర్‌ అయ్యే ఎఫ్‌డీలపై సాధారణ డిపాజిటర్లకు 6.25శాతం వడ్డీని అందిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని