అప్పుల బాధతో రైతు బలవన్మరణం

పంటల సాగులో నష్టం రావడం, కుమార్తె పెళ్లికి చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఓ రైతు సాగర్‌ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

Published : 26 Nov 2022 04:57 IST

నకరికల్లు, న్యూస్‌టుడే: పంటల సాగులో నష్టం రావడం, కుమార్తె పెళ్లికి చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఓ రైతు సాగర్‌ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్లకు చెందిన రైతు సోము మల్లారెడ్డి (55) 4 ఎకరాల సొంత పొలంతో పాటు కొంత కౌలుకు తీసుకొని వివిధ పంటలు సాగు చేశారు. గతేడాది నవంబరులో పెద్ద కుమార్తె వివాహం చేశారు. సాగులో నష్టం వచ్చి పెళ్లికి చేసిన అప్పు తీర్చలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మరో కుమార్తె ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం కారంపూడి శివారు బాలచంద్రనగర్‌ (పేటసన్నెగండ్ల)లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. దీంతో అప్పు తీర్చే మార్గం లేక మనస్తాపం చెందిన మల్లారెడ్డి ఈ నెల 23న ఇంటి నుంచి బయటకు వెళ్లారు. శుక్రవారం నకరికల్లు మండలం చేజర్ల సమీపంలోని సాగర్‌ ప్రధాన కుడి కాలువ హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద విగత జీవిగా కనిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని