
Published : 29 Dec 2021 01:40 IST
Shamshabad: బ్రేస్‌లెట్, చొక్కా గుండీల్లో రూ.20 లక్షల బంగారం అక్రమ రవాణా..!
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు.. రూ.20 లక్షలకుపైగా విలువైన 412 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు అక్రమంగా పుత్తడిని తీసుకువస్తున్నారని గుర్తించారు. ఎంతో చాకచక్యంగా బంగారాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ.. కస్టమ్స్ అధికారులు వారిని పట్టుకున్నారు. రాళ్లు పొదిగిన బ్రేస్‌లెట్‌లో బంగారాన్ని రంగు మార్చి ముక్కలుగా పేర్చారు. అయినా గుర్తించిన అధికారులు బ్రేస్‌లెట్ రంగురాళ్లను తొలగించి స్వర్ణాన్ని వెలికితీశారు. మరికొంత బంగారాన్ని చొక్కా గుండీలుగా మార్చి తరలించే ప్రయత్నం చేయగా దాన్ని కూడా కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
► Read latest Crime News and Telugu News
ఇవీ చదవండి
Tags :