Crime News: గుంటూరు జిల్లాలో దారుణం... తెదేపా కార్యకర్తపై పెట్రోల్‌ దాడి

గుంటూరు జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త వెంకటరమణపై రాజకీయ ప్రత్యర్థులు హత్యాయత్నం

Updated : 21 Dec 2021 22:30 IST

పెదనందిపాడు: గుంటూరు జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త వెంకటనారాయణ రాజకీయ ప్రత్యర్థులు హత్యాయత్నం చేశారు. పెదకూరపాడులోని అత్తారింటికి వెళ్లివస్తుండగా మార్గమధ్యలో బోయపాలెం వద్ద ప్రత్యర్థులు కాపు కాసి దాడి చేశారు. అనంతరం పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టారు. తీవ్ర గాయాలపాలైన వెంకటనారాయణను గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించారు. చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను వెంకటనారాయణ నిలదీసిన నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు. ఈ అంశంపై ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తి ఘటనకు దారితీసింది. స్థానికుల సమాచారంతో తీవ్రంగా గాయపడిన వెంకటనారాయణను 108 వాహనంలో జీజీహెచ్‌కు తరలించారు. దాదాపు 40శాతంపైగా చేతులు, ముఖం, ఛాతి భాగం కాలిపోవడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ప్రశ్నిస్తే.. చంపేస్తారా?: లోకేశ్‌

గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ దళిత కార్యకర్త వెంకటనారాయణపై వైకాపా దాడిని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు.  జగన్‌ జన్మదిన వేడుకల్లో చంద్రబాబును దూషిస్తున్న వైకాపా కార్యకర్తలను ప్రశ్నిస్తే.... మద్యం సీసాలతో నారాయణను విచక్షణారహితంగా కొట్టారని మండిపడ్డారు. తప్పు చేస్తుంటే వద్దని వారిస్తే చంపేస్తారా? అని లోకేశ్‌ ధ్వజమెత్తారు. తమను ప్రశ్నించే వారే ఉండకూడదు.. ఎదురించే వారు బతికే ఉండకూడదనేలా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని