logo

సచివాలయాలకు వెళ్లనవసరం లేదు

మే నెల సామాజిక పింఛన్లకు సంబంధించి లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని డీఆర్‌డీఏ పీడీ శచీదేవి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 30 Apr 2024 03:13 IST

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: మే నెల సామాజిక పింఛన్లకు సంబంధించి లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని డీఆర్‌డీఏ పీడీ శచీదేవి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి మేరకు పింఛన్ల పంపిణీ జరగనుందని తెలిపారు. జిల్లాలో 2,65,210 పింఛనుదారులు ఉండగా, 1,97,790 మందికి మే 1న ఉదయం 8.30 గంటలకు నేరుగా బ్యాంకు ఖాతాలోకి నగదు జమ చేస్తామన్నారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న, మంచానికే పరిమితమైన, సైనిక్‌ వెల్ఫేర్‌ పింఛన్లకు సంబంధించిన 67,420 మందికి ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది వచ్చి పింఛను సొమ్ము అందిస్తారని పేర్కొన్నారు. ఏ కారణం వల్లనైనా బ్యాంకు ఖాతాలోకి నగదు జమ కాకపోతే అలాంటి వారిని గుర్తించి 3వ తేదీన ఇంటికి వెళ్లి నగదు అందిస్తామని వెల్లడించారు. ఎవరూ పింఛను సొమ్ము కోసం ఎండలో సచివాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని