logo

క్షయ నివారణకు చర్యలు

మన్యంలో క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారిణి సాధన పేర్కొన్నారు.

Published : 17 May 2024 01:54 IST

చింతపల్లి గ్రామీణం, కొయ్యూరు, న్యూస్‌టుడే: మన్యంలో క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారిణి సాధన పేర్కొన్నారు. గురువారం లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. క్షయ వ్యాధికి గురైన వ్యక్తికి, సంబంధిత కుటుంబసభ్యులందరికీ బీసీజీ టీకాలు వేస్తున్నామని తెలిపారు. బాధితులు భయపడొద్దని, పీహెచ్‌సీల్లో మందులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వైద్యులు దినేశ్‌, వరప్రసాద్‌, ఎంపీహెచ్‌వో మురళి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు డౌనూరు పీహెచ్‌సీలో బీసీజీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని డీఐవో ప్రారంభించారు. స్థానిక వైద్యాధికారి లలిత, ఎంపీహెచ్‌ఈవో ఎం.అప్పలనాయుడు, టి.బి.సూపర్‌వైజర్‌ వై.అచ్చియ్యనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని