logo

2,08,329 మంది వజ్రాయుధాన్ని వదిలేశారు

ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఓట్ల పండగలో చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. జిల్లాలో 12,89,371 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఈ సారి 10,81,042 మంది ఓటు వేయగా, 208329 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేదు.

Published : 17 May 2024 02:16 IST

పాయకరావుపేట, అనకాపల్లి నియోజకవర్గాల్లో ఆసక్తి చూపని ఓటర్లు

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఓట్ల పండగలో చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. జిల్లాలో 12,89,371 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఈ సారి 10,81,042 మంది ఓటు వేయగా, 208329 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఒక్కో నియోజకవర్గంలో 30వేల నుంచి 44 వేల మంది ఓటింగ్‌కు దూరమయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ఓటు హక్కు వినియోగంపై బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించినా ఫలితం ఇవ్వలేకపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు, కార్మిక శాఖ, వర్తక, వాణిజ్య వ్యాపార సంస్థలకు సెలవు ప్రకటించినా ఓటర్లు బాధ్యతగా ముందుకు రాలేదు. అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం, పాయకరావుపేట, చోడవరం నియోజకవర్గాల్లో ఎక్కువ మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. వేసవి సెలవులు కలసి రావడంతో చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లి పోయి ఓటింగ్‌కు రాలేదు. థర్డ్‌ జెండర్‌ కేటగిరీలో 28 మంది ఓటర్లకు కేవలం 12 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా పాయకరావుపేట నియోజకవర్గంలో 44118 మంది, అనకాపల్లి నియోజకవర్గంలో 43132 మంది ఎన్నికల్లో వజ్రాయుధాన్ని వదులుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని