logo

మాంచానమ్మ జాతర ప్రారంభం

పెదార్కూరు  ఆదివాసుల ఇలవేల్పు అయిన మాంచానమ్మ జాతర గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం అమ్మవారిని అలంకరించిన తరవాత జాతర ప్రారంభించారు.

Published : 17 May 2024 02:09 IST

కూనవరం, న్యూస్‌టుడే: పెదార్కూరు  ఆదివాసుల ఇలవేల్పు అయిన మాంచానమ్మ జాతర గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం అమ్మవారిని అలంకరించిన తరవాత జాతర ప్రారంభించారు. పూజారి రామారావు ఆధ్వర్యంలో భక్తులు అమ్మ వారి ప్రతిమలతో శబరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గద్దెపైకి చేర్చారు. జాతర మూడు రోజులపాటు జరుగుతుందని రామారావు చెప్పారు. పలు గ్రామాలు, పట్టణాల్లో ఉన్న ఉద్యోగులు జాతరకు తరలివచ్చారు.


బాబాకు ప్రత్యేక పూజలు

మోతుగూడెం, న్యూస్‌టుడే: మోతుగూడెం సద్గురు ప్రసన్న సాయిబాబా మందిరంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు నెమలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బాబాకు ప్రత్యేక హారతి, పంచామృతాభిషేకాలు విశేష పూజలు జరిపించారు. స్థానికుడు దారబాబు దంపతులు బాబా అన్నదాన సత్రంలో మధ్యాహ్నం భక్తులకు అన్నసమారాధన ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని