logo

‘అరాచక పాలకులను సాగనంపాలి’

అరాచక పాలకులను ప్రజలు సాగనంపాలని ఎన్డీయే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు.

Published : 23 Apr 2024 06:16 IST

సుజనా చౌదరిని గజమాలతో సత్కరిస్తున్న తెదేపా-జనసేన-భాజపా నాయకులు

విజయవాడ వన్‌టౌన్‌, భవానీపురం, న్యూస్‌టుడే : అరాచక పాలకులను ప్రజలు సాగనంపాలని ఎన్డీయే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. సోమవారం పాతబస్తీ 52వ డివిజన్‌ మల్లిఖార్జునపేట, బ్రాహ్మణవీధి తదితర ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కొండ ప్రాంత ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.   చేపలమార్కెట్‌ సముదాయాన్ని ఆయన పరిశీలించారు. వ్యాపారులతో మాట్లాడారు.  నాయకులు అడ్డూరి శ్రీరామ్‌, ఎంఎస్‌ బేగ్‌, నాగుల్‌మీరా, పైలా సోమినాయుడు, యేదుపాటి రామయ్య, సుకాశి కిరణ్‌, సుకాశి సరిత, తదితరులు పాల్గొన్నారు.

  • వడ్డెర్ల సమస్యల పరిష్కారం పశ్చిమ భాజపా అభ్యర్థి సుజనా చౌదరితోనే సాధ్యపడుతుందని వడ్డెర్ల సంఘం నాయకుడు వి.సీతారాం పేర్కొన్నారు. భవానీపురంలోని భాజపా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.  నాయకులు ఎ.శ్రీనివాసరావు, కె.ప్రసాద్‌, కనకారావు, నాగరాజు, తదితరులున్నారు.

భవానీపురం, విద్యాధరపురం: భవానీపురం 41వ డివిజన్‌లో తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌ సోదరి కేశినేని శ్రీదేవి ఎన్నికల ప్రచారాన్ని సోమవారం నిర్వహించారు. విజయవాడ పశ్చిమ అభ్యర్థి సుజనాచౌదరిని, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌లను గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు.

  • తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, పశ్చిమ భాజపా అభ్యర్థి సుజనా చౌదరికి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ వచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేస్తారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. మల్లికార్జునపేటలోని వెంకన్న కార్యాలయం వద్ద భాజపా అభ్యర్థి సుజనాచౌదరితో కలిసి తెదేపా నాయకులు 38వ డివిజనులో ఎన్నికల ప్రచారాన్ని సోమవారం నిర్వహించారు. నాగుల్‌మీరా, పితాని పద్మ, అడ్డూరి శ్రీరామ్‌, అమ్మిశెట్టి వాసు, ఉమ్మడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
  • విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరిలతో మాటామంతి కార్యక్రమం ఈ నెల 24వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి విజయవాడ పాలఫ్యాక్టరీ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహిస్తున్నట్లు నాయకులు కొణిజేటి రమేష్‌, పిళ్ళా శ్రీనివాసరావు, నూకల నాగేశ్వరరావు తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని