logo

‘కూటమి’ కోసం కదలిన కోలవెన్ను

పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్‌, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌, తెదేపా నాయకుడు తుమ్మల చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి

Published : 23 Apr 2024 06:39 IST

కోలవెన్ను : అభివాదం చేస్తున్న బోడే ప్రసాద్‌, చంద్రశేఖర్‌, ఎంపీపీ రాజ్యలక్ష్మి

కంకిపాడు, కంకిపాడు గ్రామీ ణం, న్యూస్‌టుడే: పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్‌, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌, తెదేపా నాయకుడు తుమ్మల చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కంకిపాడు నుంచి పునాదిపాడు, గొల్లగూడెం, మాదాసువారిపాలెం మీదుగా కోలవెన్ను వరకు చేపట్టిన ప్రదర్శనకు ఆయా గ్రామస్థులు బ్రహ్మరథం పట్టారు. కోలవెన్ను మండపాల కూడలి ‘కూటమి’ మద్దతుదారులతో కిక్కిరిసింది. జనసైనికులు నినాదాలతో హోరెత్తించారు.

వైకాపా అభ్యర్థి జోగి రమేష్‌ అసలు స్వరూపాన్ని పెడన నియోజకవర్గ ప్రజలను అడిగితే బయటపెడతారన్నారు. తెదేపా, జనసేన కార్యకర్తలతోపాటు బీసీ, ఎస్సీలపై దాడులు చేయించారని ఆరోపించారు. పెనమలూరు రాగానే చోడవరం ఇసుక క్వారీపై కన్ను పడిందన్నారు. బోడే ప్రసాద్‌ అడ్డుకోవడంతో అక్రమ రవాణా కొంతమేర ఆగిందన్నారు. ఎంపీపీ నెరుసు రాజ్యలక్ష్మి మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి, ప్రజాసేవలను బోడే ప్రస్తావించారు.

తెదేపాలో చేరికలు : సర్పంచి సీహెచ్‌ సురేష్‌కుమార్‌, ఉపసర్పంచి కంచర్ల వెంకట్రావు, మరో ఎనిమిది మంది వైకాపా వార్డు సభ్యులు తెదేపాలో చేరారు. జనసేన నాయకులు ముప్పా రాజా, పులి కామేశ్వరరావు, తెదేపా నేతలు తుమ్మల జగదీష్‌, సుదిమళ్ల రవీంద్రప్రసాద్‌, తుమ్మలపల్లి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని