logo
Published : 12 Aug 2021 07:41 IST

AP News: హైటెక్‌ వ్యభిచారం.. నకిలీ పోలీసుతో సహా ఆరుగురి అరెస్టు


వివరాలు తెలుపుతున్న పశ్చిమ డీఎస్పీ సుప్రజ, సీఐ హైమారావు

నెహ్రూనగర్‌ (గుంటూరు), న్యూస్‌టుడే : యాప్‌ ద్వారా హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను నగరంపాలెం పోలీసులు అరెస్టు చేశారు. వారిలో నకిలీ పోలీసుతోపాటు అమెరికాలో ఉన్నత చదువులకు వెళ్లడానికి సిద్ధమైన ఓ విద్యార్థి ఉండటం గమనార్హం. బుధవారం పశ్చిమ డీఎస్పీ కె.సుప్రజ తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను తెలిపారు. క్రోసూరు మండలానికి చెందిన మహిళ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు నగరంపాలెం, అరండల్‌పేట పోలీసుస్టేషన్లలో నమోదైన కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చింది. అయినా ఆమె తీరు మారలేదు. ఏటీ అగ్రహారంలో ఇంటిని అద్దెకు తీసుకొని మళ్లీ వ్యభిచారం నిర్వహణ ప్రారంభించింది. ఆమెకు పాతగుంటూరుకు చెందిన నాగేశ్వరరావు యాప్‌ ద్వారా అమ్మాయిలను సరఫరా చేస్తున్నాడు. మిర్చి యార్డు ఎదురు భవానీపురానికి చెందిన పుట్టపాకుల నాగరాజు అలియాస్‌ పండు డ్రైవర్‌గా పనిచేసేవాడు. అయిదేళ్ల కిందట ఓ డీఎస్పీకి వ్యక్తిగత పనుల కోసం వెళుతున్న క్రమంలో అతని కారుకు నాగరాజు నాలుగు రోజులు డ్రైవర్‌గా వెళ్లాడు. అప్పుడు పోలీసులు ఎలా వ్యవహరిస్తారనేది తెలుసుకున్నాడు. ఏటీ అగ్రహారంలోని ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని తెలుసుకున్న నాగరాజు నిర్వాహకురాలి వద్దకు వెళ్లి తాను నగరంపాలెం పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నానని చెప్పాడు. నెలకు రూ. 5 వేలు ఇవ్వాలని, లేకపోతే అధికారులకు చెప్పి పట్టిస్తానని బెదిరించి మూడుసార్లు నగదు తీసుకున్నాడు. ఈక్రమంలో తమకు వచ్చిన సమాచారంతో సీఐ హైమారావు సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేశారు. వ్యభిచార నిర్వాహకురాలితోపాటు ముగ్గురు మహిళలు, ఓ విటుడిని అరెస్టు చేశారు. అదే సమయంలో నిర్వాహకురాలి వద్ద డబ్బులు వసూలు చేసుకోవడానికి వచ్చిన నకిలీ పోలీసు నాగరాజును అరెస్టు చేశారు. ముగ్గురు మహిళలను పునరావాస కేంద్రానికి తరలించారు. అదుపులోకి తీసుకున్న విటుడు రేపల్లెకు చెందిన బీటెక్‌ పూర్తి చేసిన యువకుడు. అతను మరికొద్ది రోజుల్లో ఉన్నత చదువులకు అమెరికాకు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. యాప్‌ ద్వారా యువతులను గుర్తించి గుంటూరు వచ్చి వ్యభిచార గృహంలో ఓ మహిళతో ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న నాగేశ్వరావును త్వరలో పట్టుకుంటామన్నారు. ముఠాను అరెస్టు చేసిన సీఐ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని