logo
Published : 29/11/2021 05:12 IST

సైన్స్‌ కాంగ్రెస్‌ డివిజన్‌ స్థాయి ఎంపికలు నేడు

పెడన గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో జాతీయ బాలల సైన్సు కాంగ్రెస్‌ (ఎన్‌సీఎస్‌సీ) డివిజన్‌ స్థాయి ఎంపికలను ఈ నెల 29, 30వ తేదీల్లో విజయవాడ లయోలా కళాశాల వేదికగా ఆన్‌లైన్లో నిర్వహించనున్నారు. లయోలా, కేబీఎన్‌, ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల ఆచార్యులు, అధ్యాపకులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. డివిజినస్థాయిలో వచ్చిన ప్రాజెక్టులను మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు, విజయవాడ, నందిగామ ఉప విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో ఆదివారం పరిశీలించారు. వీటిని సోమవారం విజయవాడలో న్యాయనిర్ణేతలు పరిశీలించి విద్యార్థులతో వీడియో కాల్‌లో మాట్లాడతారు. ఆ సమయంలో విద్యార్థులు తమ ప్రాజెక్టుల్ని దగ్గర పెట్టుకుని పాఠశాల లేదా ఇంటి వద్ద సిద్ధంగా ఉండాలి. ప్రాజెక్టుపై 6 నిమిషాలు వివరించాల్సి ఉంటుంది. ఐదు డివిజన్ల నుంచి సుమారు 50 ప్రాజెక్టుల్ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. డివిజన్‌ స్థాయిలో ఎంపికైన ప్రాజెక్టుల్ని అదే రోజు న్యాయనిర్ణేతలు ప్రకటించనున్నారు. సుస్థిరమైన అభివృద్ది కోసం పర్యావరణ వ్యవస్థ, సుస్థిరమైన జీవనం కోసం సాంకేతికత, సామాజిక ఆవిష్కరణ, తగిన రూపకల్పనలు, నమూనాల అభివృద్ధి, సంప్రదాయ జ్ఞాన వ్యవస్థ అనే ఐదు అంశాలపై ప్రాజెక్టుల్ని తయారు చేశారు.

7న జిల్లా స్థాయిలో ముఖాముఖి

జిల్లా స్థాయి పోటీలు వచ్చే నెల 7న ముఖాముఖి (ఆఫ్‌లైన్‌లో) నిర్వహించి, అదే రోజు ఫలితాల్ని వెల్లడిస్తారు. 14 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. వీటికి ఈ ఏడాది నగదు బహుమతి అందజేయనున్నారు.

మంచి స్థానం సాధించాలి

జిల్లాను రాష్ట్ర స్థాయిలో నిలబెట్టేందుకు ఉప విద్యాశాఖాధికారులు, ఎమ్యీవోలు, ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలి. గతంకన్నా మెరుగైన ఫలితాన్ని సాధించే దిశగా కృషి చేయాలి. విద్యార్థుల్లో సైన్సుపై జిజ్ఞాస కల్పించాలి.

- తాహేరా సుల్తానా, డీఈవో

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని