logo

ప్రకృతిలోకి ప్రయాణం...

కొవిడ్‌ వల్ల ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి బయటపడేందుకు నగరవాసులు ప్రకృతి బాట పడుతున్నారు. శని, ఆదివారాల్లో వందల సంఖ్యలో విజయవాడ, గుంటూరు నగరాలకు చెందినవారు అడవులు, నదీ తీరప్రాంతాలు, కొండలు, కోటల వైపు పయనమవుతున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే బయలుదేరి వెళుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే గడిపి వస్తున్నారు. చిన్న పిల్లలను కూడా తీసుకుని ఎక్కువగా వెళుతున్నారు. ఇలా వెళుతున్న వారిలో

Published : 06 Dec 2021 01:35 IST

వారాంతాల్లో అడవుల్లోకి నగరవాసులు

ఒత్తిడి నుంచి ఉపశమనానికి కొత్త దారులు

ఈనాడు, అమరావతి

కొవిడ్‌ వల్ల ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి బయటపడేందుకు నగరవాసులు ప్రకృతి బాట పడుతున్నారు. శని, ఆదివారాల్లో వందల సంఖ్యలో విజయవాడ, గుంటూరు నగరాలకు చెందినవారు అడవులు, నదీ తీరప్రాంతాలు, కొండలు, కోటల వైపు పయనమవుతున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే బయలుదేరి వెళుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే గడిపి వస్తున్నారు. చిన్న పిల్లలను కూడా తీసుకుని ఎక్కువగా వెళుతున్నారు. ఇలా వెళుతున్న వారిలో వైద్యులు, వైద్య కళాశాలల విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నారు. ప్రస్తుతం కొవిడ్‌ ప్రభావం తగ్గడంతో.. కుటుంబాలతో కలిసి కూడా అడవులు, కొండల్లోకి బృందాలుగా ట్రెక్కింగ్‌కు వెళుతున్నారు.

ల్లకాలువల వెంబడి..

అడవుల్లోనికి వెళ్లిన తర్వాత.. చిన్న పిల్ల కాలువల వెంబడి.. నడుచుకుంటూ వెళ్లడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. పక్షుల కిలకిలరావాలు, స్వచ్ఛమైన గాలుల మధ్య సమయమే తెలియదు. ఆ కాలువ వెంబడి చిన్న చిన్న జలపాతాలు కనిపిస్తూ ఉంటాయి. కొండపల్లి అటవీ ప్రాంతంలో చాలా జలపాతాలు ఉన్నాయి. చిన్న పిల్లల కోసం ఇటీవల వీఏసీ సంస్థ ప్రత్యేకంగా కొండపల్లి అడవిలో ట్రెక్కింగ్‌ను నిర్వహించింది. మూలపాడు నుంచి ట్రాక్టర్లలో పిల్లలను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. విజయవాడ నుంచి పెద్దసంఖ్యలో పిల్లలు, వారి తల్లిదండ్రులు వెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సరదాగా గడిపి వచ్చారు. అడవి మధ్యలో టెంట్లు వేసుకుని, జలపాతాల్లో ఆడుతూ పాడుతూ గడిపారు.

పది కిలోమీటర్ల నడక..

నగరవాతావరణానికి భిన్నంగా.. ఉండే ప్రకృతి ఒడిలోకి వెళ్లి రావడం వల్ల మానసికంగా, శారీరకంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. విజయవాడ నుంచి వాహనాల్లో మూలపాడుకు చేరుకుంటున్నారు. ఏడు నుంచి పది కి.మీ అడవులు, కొండలు, కోటల్లో నడుచుకుంటూ వెళ్లి ఎక్కడో ఒక ప్రాంతంలో సేదదీరుతున్నారు. ఆహారం తీసుకెళ్లి అక్కడే తిని విశ్రాంతి తీసుకుంటున్నారు.

జలపాతాల వద్ద...: కృష్ణా జిల్లాలోని కొండపల్లి కోట, మూలపాడు, పరిటాల దగ్గరున్న దొనబండ జలపాతాలు, కేతనకొండ, గుంటూరు పరిధిలోని కొండవీడు ఫోర్ట్‌, గుత్తికొండ బిలం ప్రాంతాలకు ఎక్కువగా రెండు నగరాల నుంచి వారాంతాల్లో ట్రెక్కింగ్‌కు వెళుతున్నారు. అడవుల్లో ఉండే స్వచ్ఛమైన జలపాతాల్లో సేదదీరుతున్నారు. విజయవాడ అడ్వెంచర్‌ క్లబ్‌(వీఏసీ) ఆధ్వర్యంలో ప్రతి శని, ఆదివారాల్లో తప్పనిసరిగా ట్రెక్కింగ్‌లను నిర్వహిస్తున్నారు. యూత్‌ హాస్టల్స్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ కూడా నగరవాసులతో కలిసి ట్రెక్కింగ్‌ను నిర్వహిస్తోంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా..ఉత్తేజాన్ని తెచ్చుకునే మార్గంగా నగరవాసులు ట్రెక్కింగ్‌ను  భావిస్తున్నారు. 

బాగా పెరిగారు..

- రఘునాథ్‌రెడ్డి యునాది, విజయవాడ అడ్వెంచర్‌ క్లబ్‌

కొవిడ్‌ ప్రభావంతో అందరూ ఇళ్లకే పరిమితమవ్వడంతో ఒత్తిడి బాగా పెరిగిపోయింది. అందుకే గతంలో కంటే ప్రస్తుతం అడవులు, జలపాతాలు, కోటల్లోకి మేం ప్రతివారం నిర్వహించే ట్రెక్కింగ్‌లకు చాలా ఎక్కువ మంది వస్తున్నారు. గతంలో ఆదివారం మాత్రమే ట్రెక్‌ ఉండేది. ప్రస్తుతం శని, ఆది రెండు రోజులు పెడుతున్నాం. వారాంతంలో కనీసం వంద నుంచి 150 మంది వస్తున్నారు. ఒకసారి పచ్చని ప్రకృతిలోకి వెళ్లి వస్తే ఆ ప్రభావం మాటల్లో వర్ణించలేనిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని