logo

బైపాస్‌లో రయ్‌..రయ్‌..!

ఎట్టకేలకు హనుమాన్‌జంక్షన్‌ బైపాస్‌ అందుబాటులోకి వచ్చింది. 16వ జాతీయ రహదారికి అనుసంధానంగా చేపట్టిన ఈ రహదారి పనులు దాదాపు పూర్తయ్యాయి. కరోనా

Published : 26 Jan 2022 04:21 IST

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: ఎట్టకేలకు హనుమాన్‌జంక్షన్‌ బైపాస్‌ అందుబాటులోకి వచ్చింది. 16వ జాతీయ రహదారికి అనుసంధానంగా చేపట్టిన ఈ రహదారి పనులు దాదాపు పూర్తయ్యాయి. కరోనా ప్రభావం, భారీ వర్షాలు, భూ సేకరణలో ప్రతిష్టంభన కారణంగా పనుల్లో వేగం మందగించింది. గతేడాది నాటికి పూర్తి కావాల్సిన నిర్మాణం ఇప్పటివరకు కొన‘సాగుతూ’ వచ్చింది. పనులు కొలిక్కి రావడంతో వేలేరు నుంచి బొమ్ములూరు వరకు బైపాస్‌ మార్గం సిద్ధమైంది. మంగళవారం రాకపోకల్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించడంతో వాహనాలు పరుగులు పెడుతున్నాయి.

ఇక నేరుగా..

చెన్నై-కోల్‌కతా మార్గంలో 16వ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలు హనుమాన్‌జంక్షన్‌ వద్ద పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్‌ రద్దీలో చిక్కుకుపోయేవి. అత్యవసర వాహనాలు మొదలుకుని, ప్రముఖుల వాహనాలు సైతం జంక్షన్‌ కూడలిని దాటుకొని వెళ్లడం ప్రహసనంగా మారింది. సంక్రాంతి, పుష్కరాలు వంటి వేడుకల సమయంలో గంటల కొద్ది ట్రాఫిక్‌ ఆగిపోయేది. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారంగా పుష్కర కాలం కిందట బైపాస్‌ రహదారిని ప్రతిపాదించారు. అన్ని అవాంతరాలను అధిగమించి ఎట్టకేలకు ఆరు వరుసల బైపాస్‌ రహదారి అందుబాటులోకి వచ్చింది.

రూపురేఖలు ఇలా...

ప్రారంభం: 1,060 కి.మీ. (వేలేరు) వద్ద

ముగింపు: 1,055 కి.మీ. (రామిలేరు) వద్ద

మొత్తం పొడవు: 6.720 కి.మీ.

పై వంతెనలు-2 ● అండర్‌ పాస్‌లు-2

మైనర్‌ బ్రిడ్జిలు-2

ఏలూరు వైపు వెళ్లే వారికి ఎంట్రీలు-3

విజయవాడ వైపు వెళ్లేవారికి ఎంట్రీలు-4

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని