logo

తోయండి.. ఇది జగన్‌మొండి

వైకాపా ఐదేళ్ల నిర్లక్ష్య పాలన.. ఉరవకొండ ఆర్టీసీ డిపో అధికారుల వైఖరి కారణంగా తరచూ బస్సులు నడి రోడ్డుపై ఆగిపోతున్నాయి. కళ్యాణదుర్గం నుంచి ఉరవకొండకు వస్తున్న పల్లె వెలుగు బస్సు పట్టణంలోని ప్రధాన రహదారిపై డిపో సమీపంలో గేర్లు పడక ఆగిపోయింది.

Published : 23 Apr 2024 04:46 IST

న్యూస్‌టుడే, ఉరవకొండ: వైకాపా ఐదేళ్ల నిర్లక్ష్య పాలన.. ఉరవకొండ ఆర్టీసీ డిపో అధికారుల వైఖరి కారణంగా తరచూ బస్సులు నడి రోడ్డుపై ఆగిపోతున్నాయి. కళ్యాణదుర్గం నుంచి ఉరవకొండకు వస్తున్న పల్లె వెలుగు బస్సు పట్టణంలోని ప్రధాన రహదారిపై డిపో సమీపంలో గేర్లు పడక ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా కదల్లేదు. అందులోని ప్రయాణికులు దిగి వెళ్లిపోయారు. దివ్యాంగులు నడుచుకుంటూ వెళ్లడానికి ఇబ్బంది పడ్డారు. ఆర్టీసీ మెకానిక్‌లు, స్థానికులు బస్సును డిపో వరకు తోసుకుంటూ వెళ్లారు. తరచూ బస్సులు మొరాయిస్తుండటంతో ప్రయాణికులు అధికారుల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు