logo

నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది

వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్‌లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది.

Published : 25 Apr 2024 05:07 IST

జగన్‌ పాలనలో అడుగంటిన రైతన్న ఆశలు

నెర్రలిచ్చి ఎండిపోయిన దొరిగల్లు చెరువు

ముదిగుబ్బ, న్యూస్‌టుడే : వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్‌లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. ఈఏడాది చెరువులో నీరు ఇంకిపోయి ఎండిపోవడంతో వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. బోరుబావుల కింద పంట పొలాలు ఎడిపోయాయి.  తెదేపా హయాంలో హంద్రీ నీవా కాలువ ద్వారా యోగి వేమన జలాశయానికి జలాలు అందించి.. జలాశయం నుంచి కుడి, ఎడమ కాలువల ద్వారా ఏడు చెరువులకు నీరందించే వారు. సాగునీరు పుష్కలంగా ఉండటంతో రైతులు రబీలోనూ పంటలు సాగు చేసేవారు. ఈ ఏడాది హంద్రీనీవా నీరు కుప్పానికి తరలించడంతో కరవు ప్రాంతం అనంతలో చెరువులకు నీరందలేదు. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోయి బోరుబావుల కింద సాగుచేసిన పంటలకు తడి అందించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. చెరువులో నీళ్లు ఉండటంతో ఏటా చేపలు పెంచుకుని మత్స్యకారులు ఉపాధి పొందేవారు. ఈసారి చెరువు ఎండిపోవడంతో వారి ఉపాధిపైనా తీవ్ర ప్రభావం చూసింది. హంద్రీ నీవా నీటితో చెరువులకు నీరందించడంలో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యానికి రైతులు బలవుతున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు