logo

వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్‌ సర్కార్‌

వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్‌ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా

Published : 25 Apr 2024 05:23 IST

సొంత నిధులతో చేపట్టిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌

నాలుగన్నరేళ్లుగా పిల్లర్ల దశలోనే కౌకుంట్ల-వైరాంపురం గ్రామాల మధ్య వంతెన (పాత చిత్రం)

వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్‌ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా ప్రధాన కాలువపై తెదేపా హయాంలో చేపట్టిన వంతెన నిర్మాణాన్ని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. గతంలోనే 70 శాతం నిర్మాణం పూర్తి కాగా.. ఈ ఐదేళ్లలో అడుగు కూడా ముందుకు పడలేదు. ఉరవకొండ నుంచి కళ్యాణదుర్గం వెళ్లాలంటే ఇదే ప్రధాన మార్గం. వంతెన నిర్మాణం మధ్యలో ఆగిపోవడంతో వాహనదారులు, ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర అవస్థ పడ్డారు. భారీ వాహనాలు సైతం ఇదే మార్గంలో వెళ్తుండటంతో కట్ట బలహీనంగా మారింది. కాలువ పక్కనే ప్రత్యామ్నాయ దారి ఏర్పాటు చేయడంతో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం సాగించాల్సిన దుస్థితి నెలకొంది. మిగిలిన 30 శాతం పనుల్ని పూర్తి చేస్తే వాహనదారులకు సౌకర్యంగా ఉండేది. అటు ప్రభుత్వం.. ఇటు నియోజకవర్గంలో అన్ని తానై వ్యవహరిస్తున్న వైకాపా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వంతెనను గాలికొదిలేశారు. ప్రజల ఇబ్బందులు చూడలేక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ సొంత నిధులతో నిర్మాణాన్ని చేపట్టారు. వైకాపా ప్రభుత్వంలో బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు పనులు నిలిపివేసిన విషయాన్ని ముందుగా గుర్తించారు. సదరు గుత్తేదారుకు వంతెన నిర్మాణం కోసం అవసరమైన సిమెంటు, కంకర, ఇనుము అందించారు.

ఈనాడు, అనంతపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని