logo

ప్రచార లోపం.. ఓటెక్కడ వేయాలో గందరగోళం

జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం కోసం ఫాం-12 దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు ముగిసింది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు 16,150 మంది ఉద్యోగులను నియమించారు.

Published : 03 May 2024 03:21 IST

16,053 మంది ఫాం - 12 దరఖాస్తు
4,6 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌

పుట్టపర్తి, న్యూస్‌టుడే : జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం కోసం ఫాం-12 దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు ముగిసింది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు 16,150 మంది ఉద్యోగులను నియమించారు. వీరిలో 16,053 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా ఎన్నికల యంత్రాంగం పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో రెండు చొప్పున ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది.  దీనిపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తూ.. ప్రచారం చేయడంలో విఫలమైంది. ఈనెల 4, 6 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రారంభం కానుంది. పీఓ, ఏపీఓలకు ఏఏ నియోజకవర్గాలకు కేటాయించారో ఉత్తర్వులు చేరుతాయి. 4, 6 తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి ప్రత్యేకంగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

శిక్షణ రోజే పోస్టల్‌ బ్యాలెట్‌

జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్దేశిత ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో ఈ నెల 4, 6 తేదీల్లో పీఓ, ఏపీఓలకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో వారు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటింగ్‌ వేయనున్నారు. ఎన్నికల విధులు కేటాయించిన నియోజకవర్గంలో శిక్షణ, ఓటు హక్కు కలిగిన నియోజకవర్గ కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలి. ఈ రెండు అంశాలపై స్పష్టత లోపించింది. ఓటు ఏ నియోజకవర్గంలో ఉందో.. అదే నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేయవచ్చన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేనయకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని