logo

రాప్తాడు నుంచే మార్పు మొదలు: సునీత

ప్రజలంతా ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారు. దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. ఆ మార్పు రాప్తాడు నియోజకవర్గం నుంచే మొదలైందని మాజీ మంత్రి పరిటాల సునీత  పేర్కొన్నారు.

Published : 03 May 2024 03:27 IST

తెదేపాలో భారీగా చేరికలు

రాప్తాడు: బొమ్మెపర్తిలో సునీతకు గజమాలతో స్వాగతం పలుకుతున్న నాయకులు

అనంతపురం(వ్యవసాయం), రాప్తాడు: ప్రజలంతా ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారు. దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. ఆ మార్పు రాప్తాడు నియోజకవర్గం నుంచే మొదలైందని మాజీ మంత్రి పరిటాల సునీత  పేర్కొన్నారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి శకం ముగిసిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. గురువారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో పరిటాల సునీత, వెంకటాపురంలో పరిటాల సిద్ధార్థ సమక్షంలో 270 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలోకి చేరాయి. రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు శేఖర్‌, ఈశ్వరయ్య, బండిప్రసాద్‌, రమణలతోపాటు మరో 250 కుటుంబాలు, చెన్నేకొత్తపల్లి మండలం సుబ్బరాయునిపల్లి నుంచి 10 కుటుంబాలు, రామగిరి మండలం నసనకోట ముత్యాలంపల్లి నుంచి 10 కుటుంబాలు, కనగానపల్లి మండలం బద్దలాపురం నుంచి పలువురు నాయకులు, కార్యకర్తల కుటుంబాలు తెదేపాలోకి చేరాయి.

  • రాప్తాడు నియోజకవర్గంలో తెదేపా, వైకాపా పాలనలో ఎవరెంత అభివృద్ది చేశారో చర్చకు సిద్ధమా ప్రకాశ్‌రెడ్డి అని సునీత సవాల్‌ విసిరారు. నియోజకవర్గంలో తోపుదుర్తి సోదరులు ఇసుక మాఫియా, మట్టి, భూమి, ఉపాధి హామీ పనుల మాఫియా ఇలా గడిచిన ఐదేళ్లు తోపుదుర్తి మాఫియా రాజ్యమేలిందన్నారు. గురువారం రాప్తాడు మండలం రామినేపల్లి, లింగనపల్లి, బొమ్మేపర్తి, బుక్కచర్ల, కొత్తపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో రోడ్‌ షోలు నిర్వహిస్తూ కూటమి మేనిఫెస్టో, తెదేపా హయాంలో చేసిన పనులను వివరించారు. కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న ఏ ఒక్కరినీ వదిలేది లేదని హెచ్చరించారు. మేనిఫెస్టో రూపొందించిన మోదీ, చంద్రబాబు, పవన్‌ చిత్రపటాలకు మహిళలు పాలాభిషేకం చేశారు. పార్టీ మండల కన్వీనర్‌ కొండప్ప, కార్యదర్శి శ్రీనివాసులు గ్రామస్థులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని