logo

మడకశిరలో తెదేపాదే విజయం

తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాలమేరకు నామినేషన్‌ ఉపసంహరించుకున్నామని, మడకశిర అభ్యర్థి ఎంఎస్‌ రాజును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మాజీ ఎమ్మెల్యే ఈరన్న తెలిపారు.

Published : 03 May 2024 03:22 IST

తెదేపా అభ్యర్థి ఎంఎస్‌ రాజును సన్మానిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఈరన్న, డా.సునీల్‌కుమార్‌

అమరాపురం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాలమేరకు నామినేషన్‌ ఉపసంహరించుకున్నామని, మడకశిర అభ్యర్థి ఎంఎస్‌ రాజును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మాజీ ఎమ్మెల్యే ఈరన్న తెలిపారు. గురువారం మాజీ ఎమ్మెల్యే ఈరన్న ఇంటి ఆవరణలో తెదేపా నాయకులు, కార్యకర్తల సమన్వయ సమావేశానికి రాయలసీమ జోనల్‌ 5 ఇన్‌ఛార్జి ప్రభాకర్‌చౌదరి, హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్త పూల నాగరాజుతోపాటు కూటమి అభ్యర్థి ఎంఎస్‌ రాజు హాజరయ్యారు. సమావేశంలో ఎంఎస్‌ రాజు మాట్లాడారు. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా అధిష్ఠానం తనను మడకశిర అభ్యర్థిగా ప్రకటించిందన్నారు. అంతకుముందు సునీల్‌కుమార్‌ను ఎంపిక చేయడంతో 50 రోజుల పాటు ప్రచారాన్ని నిర్వహించారని అభ్యర్థి మార్పు కారణంగా వారు పడ్డ ఆవేదన అర్థం చేసుకుంటానన్నారు. ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈరన్నతో పాటు సునీల్‌కుమార్‌, అతన్ని బలపరచిన నాయకులందరినీ కోరారు. ప్రభాకర్‌చౌదరి మాట్లాడుతూ ప్రతి నాయకుడు, కార్యకర్త మనోభావానికి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత తనదేనని అన్నారు. జిల్లా తెదేపా అధ్యక్షుడు అంజినప్ప, నాయకులు నరసింహమూర్తి, వీరక్యాతప్ప, శివరుద్రప్ప, ఉగ్రనరసింహ, డా.సునీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని