logo

వంద పడకలన్నారు.. హామీతో సరిపెట్టారు..

ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో రోగులను మంచాల కొరత వేధిస్తోంది. ఆసుపత్రిలో రోగులకు సరిపడా పడకలు లేకపోవడంతో ఒకదానిపైనే ఇద్దరు, ముగ్గురికి చికిత్సలు అందించాల్సిన దుస్థితి నెలకొంది.

Published : 03 May 2024 03:19 IST

ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ఒకే పడకపై ఇద్దరు మహిళలకు రక్తం ఎక్కిస్తూ..

న్యూస్‌టుడే, ధర్మవరం పట్టణం: ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో రోగులను మంచాల కొరత వేధిస్తోంది. ఆసుపత్రిలో రోగులకు సరిపడా పడకలు లేకపోవడంతో ఒకదానిపైనే ఇద్దరు, ముగ్గురికి చికిత్సలు అందించాల్సిన దుస్థితి నెలకొంది. వేసవి కావడంతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక్కడ రోజూ ఓపీ 300 నుంచి 400 మంది వరకు వస్తుంటారు. సరిపడా మౌలిక వసతులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆసుపత్రిని 50 నుంచి 100 పడకలకు పెంచుతామని వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల నాని నాలుగున్నరేళ్ల కిందట ధర్మవరానికి వచ్చిన సందర్భంలో హామీ ఇచ్చారు. రెండేళ్ల కిందట స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా వాగ్దానం చేశారు. కానీ, హామీలతోనే సరిపెట్టారు. రోగులకు వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని