logo

ఉన్నాయా కళ్లు.. ఏంచేశారు.. ఐదేళ్లు?

నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీల ప్రభుత్వమని సీఎం జగన్‌ గొప్పలు చెబుతారు. అలాంటి ఆర్భాటపు ముఖ్యమంత్రి నోరు మూయించే చిత్రమిది.

Published : 03 May 2024 03:23 IST

ఈనాడు, అనంతపురం, న్యూస్‌టుడే, కదిరి: నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీల ప్రభుత్వమని సీఎం జగన్‌ గొప్పలు చెబుతారు. అలాంటి ఆర్భాటపు ముఖ్యమంత్రి నోరు మూయించే చిత్రమిది. చిన్నపాటి పనులతో అందుబాటులోకి వచ్చే ముస్లిం మైనారిటీ గురుకుల కళాశాల భవనాన్ని  అక్షరాలా ఐదేళ్లు కన్నెత్తి చూడకుండా వదిలేసి శిథిలావస్థకు చేర్చిన వైనం.. మైనారిటీల మీద ఎంత ప్రేముందో చెప్పకనే చెబుతుంది. కదిరి నియోజకవర్గం పరిధిలో ముస్లింల జనాభా అధికంగా ఉండటంతో వారి కోసం గురుకుల కళాశాల అవసరం ఉందని గత తెదేపా ప్రభుత్వం గుర్తించింది. కదిరి శివారు లో రూ.15 కోట్లతో గురుకుల భవన నిర్మాణం చేపట్టి.. 95 శాతం పనులు పూర్తి చేసింది. రంగులు కూడా  సిద్ధం చేశారు. 2019లో ఎన్నికలు రావటంతో చిన్నపాటి పనులు ఆగాయి. భవన సముదాయంలో విద్యుత్తు, తాగునీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది. జగన్‌ ప్రభుత్వం రాగానే  భవనానికి సంబంధించిన పనులు ఆపేసింది. నాటి నుంచి నేటి వరకు  కదిరి-హిందూపురం రహదారి పక్కనే నిరుపయోగంగా ఉంది. వైకాపా తీరుపై వందలాది విద్యార్థుల తల్లిదండ్రులు  మండిపడుతున్నారు. ప్రజాధనానికి సార్థకత ఏదని ప్రశ్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని