logo

ఏడో రోజు జోరుగా నామినేషన్లు

ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్‌, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్‌ వేశారు.

Published : 25 Apr 2024 05:34 IST

లోక్‌సభకు ఆరు, అసెంబ్లీకి 63 సెట్లు
దాఖలుకు నేడే ఆఖరి రోజు

రాయదుర్గంలో ఆర్వో కరుణకుమారికి నామినేషన్‌ పత్రాలుఅందజేస్తున్న తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్‌, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్‌ వేశారు. అనంత అర్బన్‌, రాయదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి.. వంటి ప్రాంతాల్లో తెదేపా అభ్యర్థులు వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు. అనంత లోక్‌సభకు ఆరుగురు, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు 59 మంది అభ్యర్థులు 63 సెట్ల నామపత్రాలను దాఖలు పరిచారు. ఇప్పటిదాకా లోక్‌సభకు 16 మంది అభ్యర్థులు 20 సెట్లను వేయగా, అసెంబ్లీ స్థానాలకు 125 మంది అభ్యర్థులు ఏకంగా 176 సెట్లను వేయడం విశేషం. గురువారమే నామినేషన్‌ దాఖలుకు ఆఖరు రోజు. ఏడో రోజు బుధవారం లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ వేసిన వారిలో కాంగ్రెస్‌ నుంచి వజ్జల మల్లికార్జున,  వైకాపా తరఫున శంకరనారాయణ ఉన్నారు. తెదేపా ఎంపీ అభ్యర్థిగా అంబికా విఘ్నేష్‌ నామినేషన్‌ వేసేందుకు వెళ్లగా.. సమయం మీరిపోయిందని వెనక్కి పంపారు.  ః అసెంబ్లీ స్థానాలకు నామినేషన్‌ వేసిన వారిలో.. రాయదుర్గానికి తెదేపా అభ్యర్థిగా కాలవ శ్రీనివాసులు, వైకాపా తరఫున మెట్టు గోవిందరెడ్డి, ఉరవకొండ నియోజకవర్గానికి తెదేపా నుంచి పయ్యావుల కేశవ్‌, వైకాపా నుంచి వై.విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున వై.మధుసూదన్‌రెడ్డి, అనంత అర్బన్‌ నియోజకవర్గానికి తెదేపా అభ్యర్థిగా దగ్గుపాటి ప్రసాద్‌, గుంతకల్లు తెదేపా అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం, కాంగ్రెస్‌ నుంచి కె.ప్రభాకర్‌, వైకాపా నుంచి వై.వెంకటరామిరెడ్డి, తాడిపత్రి వైకాపా తరఫున పెద్దారెడ్డి, శింగనమల కాంగ్రెస్‌ నుంచి శైలజానాథ్‌, వైకాపా తరఫున వీరాంజినేయులు, కళ్యాణదుర్గం తెదేపా తరఫున అమిలినేని సురేంద్రబాబు, వైకాపా నుంచి రంగయ్య, కాంగ్రెస్‌ తరఫున రాంభూపాల్‌రెడ్డి నామినేషన్‌ వేశారు.

ఉరవకొండలో ఆర్వో కేతన్‌గార్గ్‌కు నామ పత్రాలు ఇస్తున్న తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని