logo

RK Roja: మంత్రి రోజా విందు రాజకీయాలు

వైకాపా అధిష్ఠానం ఇప్పటివరకు నగరి అభ్యర్థిని తేల్చలేదు. మంత్రి రోజాకు సీటు ఇస్తే తాము పనిచేసే ప్రసక్తి లేదని అసమ్మతి వర్గం తేల్చి చెబుతోంది. మంత్రి రోజా.. ఎన్ని విమర్శలు వచ్చినా విందు రాజకీయాలు చేస్తున్నారు.

Updated : 13 Mar 2024 08:44 IST

పుత్తూరు: వైకాపా అధిష్ఠానం ఇప్పటివరకు నగరి అభ్యర్థిని తేల్చలేదు. మంత్రి రోజాకు సీటు ఇస్తే తాము పనిచేసే ప్రసక్తి లేదని అసమ్మతి వర్గం తేల్చి చెబుతోంది. మంత్రి రోజా.. ఎన్ని విమర్శలు వచ్చినా విందు రాజకీయాలు చేస్తున్నారు. ఇటీవల ఉపాధ్యాయినులకు తాయిళాల ఎర వేశారు. ఈ కార్యక్రమానికి రాకుంటే చర్యలు తీసుకుంటామని డీఈవో పేరిట వాట్సప్‌ సందేశాలు పంపడం చర్చనీయాంశమైంది. మంగళవారం పుత్తూరు మండలం సిరుగురాజుపాళెం పంచాయతీ పరిధిలోని మామిడి తోపులో ప్రతి పంచాయతీ నుంచి 150 మందిని పిలిచి విందు ఏర్పాటు చేశారు. ఆపై పంచె, షర్టు బిట్లు, టవళ్లు పంపిణీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని