logo

‘అరాచక పాలనకు అంతం పలకండి’

వైకాపా అరాచక పాలనకు అంతం పలికేందుకు ఎన్నికల రూపంలో అవకాశమొచ్చిందని, ప్రజలు మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓటేసి తెదేపా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్‌ కోరారు.

Published : 29 Apr 2024 03:16 IST

ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో గురజాల జగన్మోహన్‌, దగ్గుమళ్ల, తెదేపా నాయకులు

చిత్తూరు(జిల్లా పంచాయతీ): వైకాపా అరాచక పాలనకు అంతం పలికేందుకు ఎన్నికల రూపంలో అవకాశమొచ్చిందని, ప్రజలు మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓటేసి తెదేపా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్‌ కోరారు. ఆదివారం 35, 36, 37వ డివిజన్లలో వారు ఎన్నికల ప్రచారం చేశారు. నరిగపల్లిలో ఎమ్మెల్యే అభ్యర్థి జగన్మోహన్‌, 16, 38వ డివిజన్లలో ఆయన సతీమణి ప్రతిమ ప్రచారం చేశారు. 9వ డివిజన్‌ గాంధీ నగర్‌కు చెందిన 300 మంది వైకాపా కార్యకర్తలు జగన్మోహన్‌, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు సమక్షంలో, క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు సి.ఆర్‌.రాజన్‌, మాజీ మేయర్‌ కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్యే గాంధీ, నాయకులు సుబ్రి, వెంకటేష్‌యాదవ్‌, రాజశేఖర్‌నాయుడు, శేషాద్రినాయుడు పాల్గొన్నారు.

వడమాలపేట: తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్‌.. కల్లూరు, టీసీ అగ్రహారం, ఎల్‌ఎం కండ్రిగ, పాదిరేడు, కాయంపేటలో ప్రచారం నిర్వహించారు. ఎస్వీపురంలో పలువురు వైకాపాను వీడి తెదేపాలో చేరారు.  

జీడీనెల్లూరు: జిల్లా తెదేపా యాదవ సాధికారసంఘ అధ్యక్షులు శ్రీధర్‌యాదవ్‌, జిల్లా ఎస్సీసెల్‌ కార్యవర్గ సభ్యులు పుష్పరాజ్‌.. నెల్లేపల్లె పంచాయతీలో మండల పార్టీ అధ్యక్షులు స్వామిదాస్‌, ఎమ్మెల్యే అభ్యర్థి థామస్‌ తమ్ముడు నిధి ఆధ్వర్యంలో జరిగిన బాబు స్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు.‌

థామస్‌ విజయానికి భాజపా తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని జిల్లా భాజపా ఉపాధ్యక్షులు మణివర్మ, రాష్ట్ర వోబీసీ కార్యవర్గ సభ్యులు సుధాకర్‌ అన్నారు.

పాలసముద్రం: చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యదర్శి వాసునాయుడు.. ఆముదాల పంచాయతీలో ఎన్నికల ప్రచారం చేపట్టారు.

ఐరాల: ఎన్డీఏ కూటమి అభ్యర్థి మురళీమోహన్‌.. వైఎస్‌ గేటు, కస్తూరినాయనపల్లె, గోళ్లవారిపల్లె, కామినాయనపల్లెలో ప్రచారం నిర్వహించారు. మండల అధ్యక్షుడు వడ్లపాటి గిరిధర్‌బాబు, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరచౌదరి, తెలుగు రైతు జిల్లా ఉపాధ్యక్షుడు హరిబాబునాయుడు, కార్యదర్శి దేవాజీ, కాణిపాకం ఆలయ మాజీ ఛైర్మన్‌ మణినాయుడు, నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు లత, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి మురళీ, జనసేన జిల్లా కార్యదర్శి తులసీప్రసాద్‌ పాల్గొన్నారు.

బంగారుపాళ్యం: వైకాపాకు కంచుకోట మహాసముద్రంలో 300 మంది వైకాపా కార్యకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్‌, మండల అధ్యక్షులు జయప్రకాష్‌నాయుడు సమక్షంలో తెదేపాలో చేరారు. కె.ఎం.కండిగ గ్రామానికి చెందిన వైకాపా సర్పంచి ప్రవళిక, ఆమె అనుచరులు తెదేపా మండల అధ్యక్షులు, జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు కోకా ప్రకాష్‌నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. కల్లూరుపల్లె దళితవాడకు చెందిన 30 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలో చేరారు.

ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాద్‌రావు, ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్‌ సమక్షంలో నల్లగాండు కోటూరులో మండల అధ్యక్షులు జయప్రకాష్‌నాయుడు నేతృత్వంలో యువకులు, మహిళలు, విశ్రాంత ఉపాధ్యాయులు వైకాపా నుంచి తెదేపాలో చేరారు. చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షులు రాజన్‌, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌, కార్యదర్శి ప్రకాష్‌నాయుడు, పూతలపట్టు నియోజకవర్గ పరిశీలకులు శ్రీధర్‌, మండల క్లస్టర్‌ అధ్యక్షులు ధరణినాయుడు, కార్యదర్శి జనార్థన్‌, ఉపాధ్యక్షులు కమల్‌నాథరెడ్డి పాల్గొన్నారు.

తవణంపల్లె: రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్‌.. మైనగుండ్లపల్లె పంచాయతీలో ప్రచారం నిర్వహించారు.

పెనుమూరు: తన తండ్రి థామస్‌ను గెలిపించాలని తనయుడు రాహుల్‌.. నాయకులతో కలిసి చిన్నమరెడ్డికండిగ, గుత్తావాండ్లఊరు, గంగుపల్లె పంచాయతీల్లో ప్రచారం నిర్వహించారు.

ఎమ్మెల్యే అభ్యర్థి థామస్‌ భార్య శాంతిరెడ్డి మండల తెదేపా అధ్యక్షుడు జయశంకర్‌నాయుడు ఆధ్వర్యంలో వివిపురంలో ప్రచారం నిర్వహించారు.

కార్వేటి నగరం: ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి శాంతారెడ్డి కేఎంపురం పంచాయతీలో ప్రచారం చేశారు.

నిండ్ర: పాదిరి దళితవాడలో యువత నందకుమార్‌, రఘువరన్‌ ఆధ్వర్యంలో వైకాపా కార్యకర్తలు, యువత అభ్యర్థి గాలి భానుప్రకాష్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని