logo
Updated : 29/11/2021 06:33 IST

ఇంధన బంకులు .. అందని సేవలు 


అమలాపురంలోని ఓ బంకులో పనిచేయని గాలి యంత్రం

న్యూస్‌టుడే, అమలాపురం(గడియార స్తంభం) : జిల్లాలో వివిధ చమురు సంస్థలకు చెందిన 415 పెట్రోలు బంకులున్నాయి. చాలా వాటిలో ఇతర సౌకర్యాలేమీ ఉండడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ప్రతి బంకులో వాహనాలకు ఉచితంగా గాలి నింపే యంత్రాలు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలను విధిగా అందుబాటులో ఉంచాలి. వీటి ఏర్పాటుకు పెట్రోలియం కంపెనీలే నిధులు సమకూర్చుతాయి. అధిక శాతం బంకుల్లో అలాంటివేమీ కనిపించడం లేదు. కొన్నిట్లో యంత్ర పరికరాలే లేవు. వాహనదారులకు చమురు నాణ్యత, కొలతలపై సందేహం వస్తే.. తక్షణం దానిని నివృత్తిచేసే ఉపకరణాలను ప్రతి బంకులోనూ ఉంచాలి. కానీ చాలామంది నిర్వాహకులు వీటిపై పెద్దగా శ్రద్ధ వహించడం లేదు.

ఎంత ఖర్చవుతుందంటే..

ద్విచక్ర వాహనం, కార్లు తదితర వాహనాల టైర్లలో గాలి ఒత్తిడి సక్రమంగా ఉండేలా చూసుకుంటారు. సరిపడినంతగా లేకపోతే మైలేజీ తగ్గడంతోపాటు వాహనానికి ఇబ్బందికరమని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ప్రైవేటు దుకాణాల్లో ద్విచక్ర వాహనానికి ఒకసారి గాలి పెడితే రూ.10, అదే కారుకైతే రూ.20 చొప్పున తీసుకుంటారు. ఇక లారీలు, ఆటోలు ఇతర వాహనాలదీ ఇదే పరిస్థితి. ద్విచక్ర వాహనానికి నెలకు నాలుగుసార్లు గాలి పట్టిస్తే ఏడాదికి రూ.480, కారుకు రూ.960 చెల్లించాల్సివస్తోందని వాహనదారులు వాపోతున్నారు. దీనిపై అధికారులు కొంచెం శ్రద్ధవహిస్తే తమకు ధనం, సమయం కలిసొస్తాయని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇవి తప్పనిసరి..

ఉచితంగా గాలి నింపాలి●

ఉచిత మరుగుదొడ్డి, ప్రాథమిక చికిత్స పెట్టె, మందులు ఉంచాలి

పెట్రోలు, డీజిల్‌ నాణ్యత, కచ్చితమైన కొలతలు తెలిపే కిట్‌ ఏర్పాటు చేయించాలి

●తాగునీటి సౌకర్యం కల్పించాలి

అగ్నిమాపక యంత్ర పరికరాలు తప్పక పెట్టించాలి

చమురు సంస్థల సేల్స్‌ అధికారి వివరాలు, చరవాణి నంబరుతో బోర్డు ఉంచాలి.

సలహాలు, ఫిర్యాదుల పుస్తకం నిర్వహించాలి

సిబ్బందికి ఇలా..: బంకుల్లో పనిచేసే సిబ్బందికి రెండు జతలు చొప్పున ఏకరూప దుస్తులు, బూట్లు అందించాలి. వారు విశ్రాంతి తీసుకోవడానికి గది ఉండాలి.

అమలుకు చర్యలు

ప్రతి పెట్రోలు బంకులో వాహనదారులు, సిబ్బందికి కనీస సదుపాయాలు విధిగా కల్పించాలి. ఉచిత గాలి యంత్రంతోపాటు ఓ వ్యక్తి అక్కడే ఉండాలి. లైసెన్సు పొందాలంటే ఆ సదుపాయాలు సక్రమంగా ఉంటేనే బంకు ఏర్పాటుకు చమురు సంస్థలు అనుమతులు ఇస్తాయి. జిల్లాలో ప్రధాన ప్రాంతాల్లోని బంకుల్లో అన్ని సదుపాయాలు అందుబాటులోఉన్నాయి. లేని చోట్ల ఏర్పాటు చేయించేందుకు చర్యలు చేపడతాం. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం. - ప్రసాదరావు, డీఎస్‌వో

నీళ్లురాని మరుగుదొడ్డి


రాజమహేంద్రవరంలో.. బోర్డుకే పరిమితం.. తాగేందుకు నీరులేదు

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని