logo

హోటలలో ఆహార భద్రత అధికారులు తనిఖీలు

భువనగిరి పట్టణంలోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ ఎం. సుమన్ కల్యాణ్‌,  ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతి సోమవారం సాయంత్రం ఆకస్మికంగా దాడులు జరిపారు.

Published : 29 Apr 2024 20:29 IST

భువనగిరి: భువనగిరి పట్టణంలోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ ఎం. సుమన్ కల్యాణ్‌,  ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతి సోమవారం సాయంత్రం ఆకస్మికంగా దాడులు జరిపారు. హోటల్స్ అపరిశుభ్రత గమనించి శుభ్రంగా ఉంచాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. హోటల్‌లో నుంచి ఫుడ్ శాంపిల్స్ సేకరించి హైదరాబాదులోని టెస్టింగ్ ల్యాబ్‌కు పంపించారు. సేకరించిన ఆహార శాంపుల్స్ కల్తీ అని తేలినట్లయితే దాని ఆధారంగా చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. కల్తీ లేకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ హోటల్ యజమానులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని