logo

అందొచ్చాడనుకుంటే.. అందకుండా పోయాడు

జాతీయరహదారి 216(ఏ)పై మూలస్థాన అగ్రహారం వద్ద శుక్రవారం కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు.

Updated : 18 May 2024 04:13 IST

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

బర్రె నాగరాజు (పాత చిత్రం)

ఆలమూరు, ఆత్రేయపురం, న్యూస్‌టుడే: జాతీయరహదారి 216(ఏ)పై మూలస్థాన అగ్రహారం వద్ద శుక్రవారం కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు. ఎస్సై శ్రీనునాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం... ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన బర్రె నాగరాజు (21) తన ద్విచక్రవాహనంపై మూలస్థానం ఇందిరాకాలనీకి చేరుకునే సందర్భంలో డివైడర్‌ దాటుతుండగా రాజమహేంద్రవరం నుంచి రావులపాలెం వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో బలమైన గాయాలు తగిలి ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీస్‌ సిబ్బంది, హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. నాగరాజు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. తాపీ పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అందివచ్చినవాడు అందకుండా పోయాడంటూ విలపిస్తున్న తీరు అందరిని కలిచివేసింది. ర్యాలి శివారు వెంకటేశ్వర నగర్‌కు చెందిన బర్రె సత్యనారాయణ, నాగమణిల రెండో కుమారుడు బర్రె నాగరాజు. అతని మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఉదయం పనిమీద ద్విచక్రవాహనంపై రావులపాలెం వెళ్లి అక్కడి నుంచి సోదరుడు సతీష్‌ అత్తవారి గ్రామం మూలస్థానం శివారు ఇందిరాకాలనీకి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని