logo
Published : 01/12/2021 01:03 IST

కొవిడ్‌తోనే డైసైక్లోమైన్‌ నిల్వలు తీసుకెళ్లలేదు

ఈనాడు, అమరావతి : జిల్లాలో 2020-21 సంవత్సరానికి పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, డీఎంఈ పరిధిలోని ఆస్పత్రులకు 42,881 యాంఫిల్స్‌ డైసైక్లోమైన్‌ నిల్వలు రాగా కొవిడ్‌తో 11,508 మాత్రమే తీసుకెళ్లాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రజాసంబంధాల అధికారి తెలిపారు. కొవిడ్‌ కారణంగా నిల్వలు తీసుకెళ్లలేదని, అందువల్లే మిగిలాయన్నారు. ఆస్పత్రుల అవసరాలకు అనుగుణంగానే ఏపీఎంఎస్‌ఐడీసీ ఔషధాలను సరఫరా చేస్తుందని స్పష్టం చేశారు. మంగళవారం ‘ఈనాడు’ అమరావతి సంచికలో ‘ఏడాదంతా దాచి... గడువు ముగిసే వేళ ఇచ్చి’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించి అధికారులు వివరణ ఇచ్చారు. ‘మందులను ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆస్పత్రులకు పంపుతాం. అదనంగా అవసరమైతే కూడా పంపుతామని, గోదాములో దాచడమనేది ఉండదని’ చెప్పారు. డైసైక్లోమైన్‌ మందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ, సరఫరాలో ఎలాంటి జాప్యం చోటుచేసుకోలేదన్నారు.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని