logo

నగర కాంగ్రెస్‌లో సరికొత్త జోష్‌!

వరస అపజయాలు..  క్యాడర్‌ చేజారిపోతోందన్న ఆందోళన.. ఇలా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న నగర కాంగ్రెస్‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పాదయాత్ర సరికొత్త ఉత్సాహం నింపింది.

Published : 03 Nov 2022 03:21 IST

కూకట్‌పల్లి వద్ద టీపీసీసీ సభ్యుడు సత్యం, శ్రీరంగంతో మాట్లాడుతున్న రాహుల్‌

ఈనాడు, హైదరాబాద్‌: వరస అపజయాలు..  క్యాడర్‌ చేజారిపోతోందన్న ఆందోళన.. ఇలా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న నగర కాంగ్రెస్‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పాదయాత్ర సరికొత్త ఉత్సాహం నింపింది. నాలుగు రోజులపాటు 86 కిలోమీటర్ల యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2018 ఎన్నికల తర్వాత నుంచి క్రమేపీ నగర కాంగ్రెస్‌ డీలా పడుతూ వచ్చింది. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి రేవంత్‌రెడ్డి ఒక్కరే గెలిచారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సబితారెడ్డి, సుధీర్‌రెడ్డి తెరాసలో చేరడంతో ప్రాతినిధ్యం కోల్పోయింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ చేదు ఫలితాలే వచ్చాయి. ఈ నేపథ్యంలో రాహుల్‌ పాదయాత్రకు కార్యకర్తలు, ప్రజల నుంచి ఆదరణ లభించడంతో శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ‘‘ప్రజలు స్వచ్ఛందంగా హాజరయ్యారు. రాహుల్‌తో కలిసి నడిచేందుకు ఆసక్తి చూపారు. పార్టీపై ప్రజల్లో ఉన్న ఆదరణను జోడో యాత్ర స్పష్టం చేసింది.’’అని నగర కాంగ్రెస్‌ నాయకుడు ఒకరు చెప్పారు. పాదయాత్ర 4 రోజులపాటు షాద్‌నగర్‌, రాజేంద్రనగర్‌, బహదూర్‌పురా, చార్మినార్‌, నాంపల్లి, గోషామహల్‌, ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో సాగింది.  

దిగ్విజయ్‌ సింగ్‌తో కాంగ్రెస్‌ నేత గొట్టిముక్కల పద్మారావు తదితరులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని