logo

వాయు నాణ్యత.. నానాటికీ క్షీణత!

నగరంలో వాయు నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. వాయు నాణ్యత సూచీ పరిమితి దాటుతోంది. కొన్ని ప్రాంతాల్లో సగటున 200కు పైగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

Published : 08 Feb 2023 02:08 IST

జూపార్కు వద్ద అత్యధిక కాలుష్యం

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో వాయు నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. వాయు నాణ్యత సూచీ పరిమితి దాటుతోంది. కొన్ని ప్రాంతాల్లో సగటున 200కు పైగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. వాహనాల ఉద్గారాలు, నిర్మాణ కార్యకలాపాలు, కర్మాగారాలు, శిలాజ ఇంధనాలు, చెత్తను కాల్చడంతో ఘన, ద్రవకణాలు బహిరంగ వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఆందోళన కలిగించే ప్రాంతాలను పరిశీలిస్తే జూపార్కు వద్ద విపరీతంగా కాలుష్యం నమోదవుతోంది. ఇక్కడ జనవరిలో సగటు 216గా నమోదైంది. బొల్లారంలో 152, పాశమైలారంలో 142, జీడిమెట్ల 127, చార్మినార్‌ 120, బాలానగర్‌ 118గా ఉంది.

* నగరంలో ప్రస్తుతం పీఎం (పార్టిక్యులేట్‌ మ్యాటర్‌) 2.5 ధూళి కణాల సాంద్రత 34 మైక్రోగ్రాములుగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇది 15 మైక్రోగ్రాములుగా ఉండాలని నిర్దేశించగా నగరంలో 2.3 రెట్లు ఎక్కువగా నమోదైంది. పీఎం-10, 55 మైక్రోగ్రాములుగా, కార్బన్‌ మోనాక్సైడ్‌ పరిమాణం 288గా నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని