logo

సీబీఐతో దర్యాప్తు చేయించండి

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని యువజన కాంగ్రెస్‌ గ్రేటర్‌ అధ్యక్షుడు మోత రోహిత్‌ డిమాండ్‌ చేశారు.

Published : 25 Mar 2023 02:21 IST

దిష్టిబొమ్మలు దహనం చేస్తున్న మోత రోహిత్‌,   యువజన కాంగ్రెస్‌ నాయకులు

విద్యానగర్‌, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని యువజన కాంగ్రెస్‌ గ్రేటర్‌ అధ్యక్షుడు మోత రోహిత్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం యువజన కాంగ్రెస్‌ నాయకులు బాగ్‌ అంబర్‌పేట డివిజన్‌ విద్యానగర్‌ నుంచి ఎన్‌సీసీ చౌరస్తాలోని ఓయూ గేటు వరకు ర్యాలీగా వచ్చారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రశ్నపత్రాల లీకేజీలో మంత్రి కేటీఆర్‌ పాత్ర ఉందని, సిట్‌ అతన్ని ఎందుకు విచారణకు పిలువలేదని ప్రశ్నించారు. దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. సీబీఐ దర్యాప్తు అంటే కేసీఆర్‌, కేటీఆర్‌లు భయపడుతున్నారని అన్నారు. పార్టీ గ్రేటర్‌ ప్రధాన కార్యదర్శులు సాయిబాబా, ఉదయ్‌కుమార్‌, నేతలు పవన్‌కల్యాణ్‌, రాథోడ్‌, పరమేశ్‌, హరి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని