logo

పార్టీ ఏదైనా టిక్కెట్‌ మంచిరెడ్డికే..

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 16 సార్లు ఎన్నికలు జరిగాయి. వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించి నాలుగోసారి పోటీ చేసే అవకాశం మాత్రం మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి మాత్రమే దక్కింది.

Published : 31 Oct 2023 02:50 IST

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 16 సార్లు ఎన్నికలు జరిగాయి. వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించి నాలుగోసారి పోటీ చేసే అవకాశం మాత్రం మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి మాత్రమే దక్కింది. ఏ పార్టీలో ఉన్నా టికెట్‌ కైవసం చేసుకోవడం విశేషం. 2009, 2014 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా.. 2018లో తెరాస అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపొందారు. 2023 ఎన్నికల్లో భారాస అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అంతకుముందు 1957, 1962, 1967 ఎన్నికల్లో ఎంఎన్‌ లక్ష్మీనర్సయ్య(కాంగ్రెస్‌) విజేతగా నిలిచి హ్యాట్రిక్‌ సాధించారు. పంచాయతీరాజ్‌, రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. నాలుగోసారి కూడా కాంగ్రెస్‌ పార్టీ అతనికే టికెట్‌ కేటాయించి.. చివరి నిమిషంలో అనంతరెడ్డిని రంగంలోకి దించడంతో లక్ష్మీనర్సయ్య పోటీ నుంచి తప్పుకున్నారు. ఏజీ కృష్ణ, కొండిగారి రాములు రెండేసి సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారు.

న్యూస్‌టుడే, యాచారం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు