logo

నగరం గరం

Published : 20 Apr 2024 03:12 IST

ఈ ఎండాకాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

ఈనాడు, హైదరాబాద్‌: నగరం నిప్పుల కుంపటిలా మారింది. సెగలు కక్కుతోంది. శుక్రవారం హైదరాబాద్‌లో కేపీహెచ్‌బీలో రికార్డు స్థాయిలో 43 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇదే అత్యధికం. గురువారంతో పోలిస్తే స్వల్పంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాయంత్రానికి శివారు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది.పెరిగిన విద్యుత్తు వినియోగం.. ఎండల దెబ్బకు కరెంట్‌ డిమాండ్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి చేరింది. గురువారం తొలిసారి 4 వేల మెగావాట్లు దాటి 4053 మెగావాట్లు నమోదైంది. శుక్రవారం 4093 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నమోదైంది. ః వినియోగపరంగానూ గురువారం ఆల్‌టైమ్‌ రికార్డుకు చేరింది. 84.68 మి.యూ.ల సరికొత్త రికార్డు నమోదైంది. అంతక్రితం ఏప్రిల్‌ 2న అత్యధిక వినియోగం 83.84 మిలియన్‌ యూనిట్లు నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని