logo

నగరానికి సాగర్‌ జలాల పంపింగ్‌

హైదరాబాద్‌ జంట నగరాలు, నల్గొండ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్‌ జలాశయంలో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోంది.

Published : 20 Apr 2024 03:13 IST

కొనసాగుతున్న ప్రయోగాత్మక పరిశీలన

పెద్దఅడిశర్లపల్లి: హైదరాబాద్‌ జంట నగరాలు, నల్గొండ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్‌ జలాశయంలో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోంది. శుక్రవారం నాటికి 120 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన మూడు, 60 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన నాలుగు మోటార్ల పనులు పూర్తి చేసి 600 క్యూసెక్కుల నీటిని ఏఎమ్మార్పీ అప్రోచ్‌ కెనాల్‌కు సరఫరా చేస్తున్నారు. ఈ నీటితో అప్రోచ్‌ కెనాల్‌లో నిర్ణీత నీటిమట్టం నిర్వహిస్తూ మోటార్ల డ్రాఫ్ట్‌ ట్యూబ్‌ ప్రెజర్‌ తగ్గకుండా చర్యలు చేపడుతున్నారు. పుట్టంగండి పంపుహౌజ్‌ నుంచి అవాంతరాలు లేకుండా రెండు మోటార్ల నుంచి 800 క్యూసెక్కులు విడుదల చేస్తూ అక్కంపల్లి జలాశయానికి సరఫరా చేస్తున్నామని జలమండలి డీజీఎం వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. రెండు రోజుల్లో 10 మోటార్లు సిద్ధం చేసి 900 క్యూసెక్కులు ఈ మోటార్లతో విడుదల చేయనున్నామని ఆయన వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని