logo

సీఎం సుడిగాలి పర్యటన నేడు

ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్‌, నారాయణపేట, మహబూబ్‌నగర్‌లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో నేడు (మంగళవారం) సుడిగాలి పర్యటన చేయనున్నారు.

Published : 23 Apr 2024 03:56 IST

నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో కార్యక్రమాలు 

బిజినేపల్లిలో జనజాతర సభకు సిద్ధమవుతున్న వేదిక

ఈనాడు, మహబూబ్‌నగర్‌, కొడంగల్‌, కొడంగల్‌ గ్రామీణం: ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్‌, నారాయణపేట, మహబూబ్‌నగర్‌లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో నేడు (మంగళవారం) సుడిగాలి పర్యటన చేయనున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరుకు మధ్యాహ్నం 12 గంటలకు రానున్నారు. మండల కేంద్రంలో జరిగే కొడంగల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకుల సమావేశంలో పాల్గొంటారు.  అనంతరం కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలోని బావాజీ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. తరువాత మద్దూరు వచ్చి హెలికాప్టర్‌లో నాగర్‌కర్నూల్‌ వెళ్లి ఎంపీ అభ్యర్థి మల్లు రవి నామినేషన్‌ కార్యక్రమంలో, బిజినేపల్లిలో జరిగే జనజాతర సభలో పాల్గొంటారు.

 మద్దూరు మండలానికి సీఎం రేవంత్‌ రెడ్డి రాకను పురస్కరించుకుని కొడంగల్‌ నియోజకవర్గ సమన్వయకర్త తిరుపతిరెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షించారు. దుద్యాల, బొంరాస్‌పేట మండలాల పరిధిలోని కార్యకర్తలు మద్దూరులో జరిగే సమావేశానికి తరలిరావాలని పార్టీ అధ్యక్షులు శేఖర్‌, నర్సింహులుగౌడ్‌ కోరారు.

జోరందుకుంటున్న నామపత్రాల సమర్పణ: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు ముంచుకొస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల పత్రాల సమర్పణ జోరందుకుంటోంది. సోమవారం మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ స్థానాల పరిధిలో మొత్తం 10 నామపత్రాలు దాఖలయ్యాయి. కాంగ్రెస్‌ నుంచి చల్లా వంశీచంద్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సరోజనమ్మ పేరు మీద మరో సెట్టు నామపత్రాలు దాఖలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని