logo

భేషజాలు వద్దు.. సమన్వయంతో పనిచేయండి

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భేషజాలకు పోకుండా ముఖ్యులు సమన్వయంతో పనిచేయాలని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌మున్షీ అన్నారు. మంగళవారం పటాన్‌చెరు మండలం చిట్కుల్‌ గ్రామంలో మెదక్‌ అభ్యర్థి నీలం మధు కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు.

Updated : 01 May 2024 05:07 IST

కాంగ్రెస్‌ నాయకులతో సమావేశమైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌మున్షీ

పటాన్‌చెరు, న్యూస్‌టుడే: పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భేషజాలకు పోకుండా ముఖ్యులు సమన్వయంతో పనిచేయాలని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌మున్షీ అన్నారు. మంగళవారం పటాన్‌చెరు మండలం చిట్కుల్‌ గ్రామంలో మెదక్‌ అభ్యర్థి నీలం మధు కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. చివరి 10రోజులు కష్టపడిన వారికి పార్టీ గుర్తింపు ఇస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి, పార్లమెంటు ఇంఛార్జి విశ్వనాథ్‌, మెదక్‌ ఎమ్మెల్యే రోహిత్‌, మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, జగ్గారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు నిర్మల, పటాన్‌చెరు, గజ్వేల్‌, దుబ్బాక, నర్సాపూర్‌, సిద్దిపేట నియోజకవర్గాల ఇంఛార్జులు శ్రీనివాస్‌గౌడ్‌, నర్సిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజిరెడ్డి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని