logo
Published : 01/12/2021 03:46 IST

శిబేరాల కాలం.. ఓట్లకు గాలం

రసవత్తరంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

ఇతర రాష్ట్రాల్లో మకాం వేసిన కొందరు ఓటర్లు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఓటర్లను మభ్యపెట్టే ఎత్తుగడలు రోజుకింతగా పెరుగుతున్నాయి. ఓటుకింత రేటు అనేలా మాటల ఒప్పందాలు కుదురుతున్నాయి. ఇప్పటికే తెరాస తమకు అనుకూలంగా ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వేర్వేరు ప్రాంతాల్లో శిబిరాల్ని నిర్వహిస్తోంది. ఎక్కువ మంది తెరాస నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులే ఉండటంతో వారిని ముందస్తు వ్యూహంలో భాగంగానే గోవా, బెంగళూర్‌తోపాటు శ్రీలంక ప్రాంతాలకు విహారం నిమిత్తం పంపించారు. వీరి పర్యవేక్షణను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోపాటు ముఖ్యనేతలు చూస్తున్నారు.  బయట వ్యక్తులతో మాట్లాడకుండా ఉండేలా నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్‌ ముందు రోజు వరకు శిబిర రాజకీయాలతో రెండింటికి రెండు స్థానాల్ని గెలిచేలా వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. మరోవైపు స్వతంత్రులుగా బరిలో నిలబడిన అభ్యర్థులు శిబిరాల్లో ఉన్నవారితో మాట్లాడే ప్రయత్నాల్ని పలురకాలుగా చేస్తున్నారు.

అభ్యర్థనలు...
బ్యాలెట్‌ విధానంలో జరిగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులకు ఓటర్లు కచ్చితంగా 1, 2 క్రమసంఖ్యని నచ్చిన వాళ్లకు వేయాల్సి ఉంటుంది. అంతకన్నా ఎక్కువగా తక్కువగా వేస్తే ఆ ఓటు చెల్లుబాటు అవదు. అందుకని శిబిరంలో ఉన్న వారికి ముఖ్యనేతలు మొదటి, రెండో ఓట్లను ఎలా వేయ్యాలనే విషయమై అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు కూడా మొదటి ప్రాధాన్యం ఎవరికి వేసినా.. కనీసం రెండో ప్రాధాన్య ఓటును తమకు వెయ్యమనేలా వేడుకుంటున్నారు. ఇక భాజపా, కాంగ్రెస్‌ల తరపున అభ్యర్థులు లేకపోవడంతో ఈ పార్టీ ప్రజాప్రతినిధులు స్వతంత్రుల వైపునకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక అధికార తెరాసకు కార్పొరేటర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతోపాటు కౌన్సిలర్లలో మెజారిటీ మద్దతు ఉండటంతో గెలుపు నల్లేరు మీద నడక అనేలా ధీమాతో ఉన్నారు. వీరే కాకుండా ఎక్స్‌అఫిషియో సభ్యుల హోదాలో 14 మంది ఓటు వేయబోతున్నారు. ఇందులో భాజపా తరపున ఎంపీ బండి సంజయ్‌ ఉండగా.. తెరాస తరపున ఎంపీ నేత వెంకటేశ్‌, మంత్రులు కేటీఆర్‌, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, దాసరి మనోహర్‌రెడ్డి, సంజయ్‌కుమార్‌, కె. విద్యాసాగర్‌రావు, చెన్నమనేని రమేశ్‌బాబు, రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, సతీష్‌బాబులున్నారు. కాంగ్రెస్‌ తరపున మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 70 మండలాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంది. కరీంనగర్‌, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలే కాకుండా భూపాలపల్లి, హనుమకొండ, సిద్దిపేట జిల్లాలోని ప్రజాప్రతినిధులు కొందరు ఓటు వేయనున్నారు. ఇందుకోసం మొత్తంగా 8 చోట్ల ఎన్నికల సంఘం ఆదేశాలో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని