logo

ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లాలో అందిస్తున్న ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 30 Apr 2024 02:07 IST

సిరిసిల్ల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో అందిస్తున్న ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో రాజీవ్‌నగర్‌లోని మినీస్టేడియంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరం మే 3 నుంచి జూన్‌ 3 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని బాల, బాలికలకు కరాటే, యోగా, వాలీబాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌, బాస్కెట్‌ బాల్‌, విలువిద్య, కబడ్డీ, అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు చరవాణి నంబర్లు 9059465889, 7569207411లలో సంప్రదించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని