logo

నటి హర్షికపై దాడి

పులకేశినగరలో తన భర్త భువన్‌తో కలిసి వెళుతున్న సమయంలో కొందరు దుండగులు తమపై దాడి చేసి, తన గొలుసు దోచుకునేందుకు ప్రయత్నించారని పులకేశినగర ఠాణాలో నటి హర్షిక పుణచ్చ ఫిర్యాదు చేశారు.

Published : 20 Apr 2024 05:22 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : పులకేశినగరలో తన భర్త భువన్‌తో కలిసి వెళుతున్న సమయంలో కొందరు దుండగులు తమపై దాడి చేసి, తన గొలుసు దోచుకునేందుకు ప్రయత్నించారని పులకేశినగర ఠాణాలో నటి హర్షిక పుణచ్చ ఫిర్యాదు చేశారు. పోలీసులు తక్షణమే స్పందించలేదని ఆక్రోశించారు. మసీదు రోడ్డులోని ఒక రెస్టారెంటులో గురువారం రాత్రి భోజనం చేసేందుకు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఆమె తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని