logo
Published : 01/12/2021 03:03 IST

ప్రభుత్వం సహకరిస్తే కలంకారీ కళకళ

నిఫ్ట్‌ సదస్సులో ఉత్పత్తిదార్లు


సదస్సులో మాట్లాడుతున్న మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ ఆనందప్రసాద్‌. వేదికపై శ్రీవాణి తదితరులు

పెడన, న్యూస్‌టుడే: కలంకారీ పరిశ్రమకు మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రభుత్వ సహకారం అవసరమని పలువురు ఉత్పత్తిదారులు అభిప్రాయపడ్డారు. మంగళవారం స్థానిక విఘ్నేశ్వర ప్రార్థన మందిరంలో హైదరాబాద్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌) ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. నిఫ్ట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ టి.శ్రీవాణి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 హస్తకళలు భౌగోళిక గుర్తింపు పొందాయని ఇందులో కలంకారీ కూడా ఉందన్నారు. డిసెంబరులో హస్తకళలపై జాతీయ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో పరిశ్రమ కష్టనష్టాలను తెలుసుకునేందుకు పెడనలో సదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిఫ్ట్‌ విద్యార్థినులు పెడనలో కలంకారీపై డాక్యుమెంటరీ చిత్రీకరించారని తెలిపారు. సదస్సుకు కలంకారీ అసోసియేషన్‌ కార్యదర్శి సజ్జా నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌, అసోసియేషన్‌ సభ్యుడు బండారు ఆనందప్రసాద్‌, కట్టా నిర్మల్‌కుమార్‌, ఉత్పత్తిదారులు పాల్గొన్నారు.

జీఎస్టీ పెంపుదలపై నిరసన : 2022 జనవరి 1 నుంచి వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ను 5 నుంచి 12 శాతానికి పెంచాలని కేంద్రం నిర్ణయించటాన్ని పలువురు ఉత్పత్తిదారులు నిరసన వ్యక్తం చేశారు. బందరు కలంకారీ అధినేత పీబీఎల్‌ నాగేంద్రరావు మాట్లాడుతూ కలంకారీకి అవసరమైన రంగులు, కోరా వస్త్రాలను ప్రభుత్వం ఒక బ్యాంక్‌ను ఏర్పాటు చేసి సరఫరా చేయాలని సూచించారు. ప్రవాహపు నీటి ప్రక్రియకు ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఉత్పత్తిదారులు యర్రా టార్జాన్‌, బళ్ల ప్రసాద్‌, బళ్ల సూర్యచంద్రరావు, పిచ్చుక కోటేశ్వరరావు, భట్ట భానుప్రకాష్‌ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఇటీవల మృతిచెందిన కలంకారీ వ్యాపారి యక్కల సుకుమార్‌కు నివాళులర్పించారు.

 

 
Read latest Krishna News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని