logo

దుర్గగుడి హుండీ ఆదాయం రూ.1.16కోట్లు

దుర్గగుడి హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో సోమవారం లెక్కించారు. వారం రోజుల వ్యవధిలో 44 హుండీల్లో కానుకలు లెక్కించగా రూ.1,16,95,213 ఆదాయం వచ్చినట్లు

Updated : 24 May 2022 03:06 IST

కానుకల లెక్కింపును పర్యవేక్షిస్తున్న ఈవో భ్రమరాంబ

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే : దుర్గగుడి హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో సోమవారం లెక్కించారు. వారం రోజుల వ్యవధిలో 44 హుండీల్లో కానుకలు లెక్కించగా రూ.1,16,95,213 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు 511 గ్రాముల బంగారం, 2.965 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారు. ఇ-హుండీ ద్వారా దేవస్థానానికి రూ.15,987 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. కానుల లెక్కింపును ఈవో భ్రమరాంబ పర్యవేక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని