logo

‘ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారు’

గన్నవరం నియోజకవర్గానికి చెందిన అంబాపురం పంచాయతీ నగరానికి చేరువుగా ఉన్నా.. అభివృద్ధి జాడ మాత్రం కన్పించడం లేదు. అంతరవలయ రహదారికి ఒకవైపు నగరపాలకసంస్థ అందమైన రహదారులతో, తాగునీరు, కాలువలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే..

Updated : 27 Apr 2024 05:12 IST

అభివృద్ధిని గాలికొదిలేశారంటూ వంశీ తీరుపై అసంతృప్తి

నిర్మాణ వ్యర్థాలతో నరకాన్ని తలపించేలా రహదారి

ఈనాడు, కృష్ణా: గన్నవరం నియోజకవర్గానికి చెందిన అంబాపురం పంచాయతీ నగరానికి చేరువుగా ఉన్నా.. అభివృద్ధి జాడ మాత్రం కన్పించడం లేదు. అంతరవలయ రహదారికి ఒకవైపు నగరపాలకసంస్థ అందమైన రహదారులతో, తాగునీరు, కాలువలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే.. మరోవైపు ఉన్న అంబాపురం పంచాయతీలో మాత్రం రోడ్లు వేయక, కాలువలు లేక ఇంటి ముందే మురుగు పారుతూ, విపరీతమైన దోమలతో, ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలతో అధ్వానంగా ఉంది. బోరునీరు తాగలేక, మంచినీరురాక ఇబ్బంది పడుతున్నారు. చిత్రమేమంటే.. ఏకంగా అంబాపురం పంచాయతీ సిబ్బందే ట్రాక్టర్లతో సేకరించిన చెత్తను జనావాసాల మధ్యలో ఖాళీ స్థలాల్లో తెచ్చి వేస్తున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వంశీ అయిదేళ్లలో ఒక్కసారి కూడా ఈ గ్రామ అభివృద్ధి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తారో మేమూ చూస్తామంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

కాలువలు లేక ఎక్కడ చూసినా ఇళ్ల మధ్య మురుగుతో ఇలా..

పంచాయతీ ట్రాక్టర్‌తో జనావాసాల మధ్య ఖాళీ స్థలాల్లో చెత్త డంపింగ్‌ చేస్తూ..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని